6 లక్షల కోసం వంద గడపలు ఎక్కి దిగాను : దిల్ రాజు ఎమోషనల్
TeluguStop.com
ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజు ఒక స్టార్ ప్రొడ్యూసర్ అలాగే నైజాం కింగ్.
డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆయన ఒక దిగ్గజం.ఈరోజు ఈ స్థాయిలో దిల్ రాజు ఉన్నాడంటే ఆయన తొలినాల్లలో ఎంతో కష్టపడే వచ్చాడు.
మొదటి మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక సినిమాలు మానేసి కేవలం వ్యాపారం చేసుకోవాలని భావించాడు.
ఇలాంటి సమయంలో అతని అదృష్టం వరించింది.దిల్ రాజు కేవలం చిన్న దుకాణం పెట్టుకుని హైదరాబాదులో కాలం వెళ్ళదీస్తున్న రోజులవి.
చిన్నాచితక డబ్బులు కూడా గట్టి రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసిన అవి కూడా పరాజయం పాలయ్యాయి.
దాంతో ఓ రోజు నటుడు మరియు నిర్మాత అయిన కాస్ట్యూమ్ కృష్ణ ని కలిశాడు.
ఆ సమయంలో కృష్ణ పెళ్లి పందిరి అనే సినిమాను తీస్తున్నాడు.ఆ సినిమా మాతృకను కన్నడలో దిల్ రాజు చూసి ఎంతో ముచ్చటపడి ఆ సినిమాని ఎలాగైనా నైజాం ఏరియా కి డిస్ట్రిబ్యూషన్ కొనుక్కోవాలని భావించాడు.
కృష్ణ సైతం కేవలం 60 లక్షల కే ఆ సినిమా రైట్స్ ని ఆఫర్ చేశాడు.
అలా ఆ 60 లక్షలు కూడా పెట్టడానికి దిల్ రాజు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.
ఆ సమయానికి అతడి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. """/" /
అయితే దిల్ రాజు పడుతున్న కష్టాలను చూసి కాస్ట్యూమ్ కృష్ణ ఒక ఆఫర్ ఇచ్చాడు.
60 లక్షల లో మొదటి 30 లక్షలు నాలుగు దఫాలుగా చెల్లించాలని చెప్పాడు మిగతా 30 లక్షలు సినిమా విడుదలయ్యాక ఇవ్వాలని ఆఫర్ ఇవ్వగా అందుకు దిల్ రాజు ఓకే చెప్పాడు.
అయితే ఒక్కోసారి ఆరు లక్షల చొప్పున చేయాల్సి చెల్లించాల్సి ఉండగా 10000, 20000 ల చొప్పున అందరి దగ్గర చేయబడులు తీసుకొని మొదటి ఆరు లక్షల జమ చేశాడు.
అలా సినిమా విడుదల అయ్యే వరకు ఎంతో కష్టాలు పడాల్సి వచ్చింది దిల్ రాజుకి.
కానీ తన కష్టానికి తోడుగా ఎమ్మెస్ రాజు సగం సినిమాను కొనుక్కోవడానికి ముందుకు రావడంతో ఎలాగోలా గట్టెక్కడు దిల్ రాజు ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ రావడంతో తదుపరి 30 లక్షలు అలవోకగా చెల్లించేశాడు.
పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!