పవన్ లాంటి హీరోలకు పదేళ్లు హిట్ లేకపోయినా పోయేదేం లేదు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్( Dil Raju ) గురించి మనందరికీ తెలిసిందే.

దిల్ రాజు ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తూ ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.దిల్ రాజ్ బ్యానర్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం ఫ్యామిలీ స్టార్( Family Star ).

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

"""/" / అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సినిమా హిట్, ఫ్లాప్స్ ప్రభావం కేవలం నిర్మాతలపైనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.సినిమా పోతే హీరోలకు పోయేదేమీ లేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కెరీర్ లో పదేళ్ల పాటు హిట్ లేదని అయినా ఆయనకు పోయేది ఏమీ లేదని అన్నారు.

కానీ సినిమా నిర్మాతల వరకు మాత్రం సినిమా పోతే మాత్రం చాలా నష్టం ఉంటుంది.

మూవీకి వచ్చే రిజల్ట్ పైనే నిర్మాత భవిష్యత్ ఉంటుంది అని తెలిపారు దిల్ రాజు.

"""/" / ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆయన కామెంట్స్ కి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?