దిల్ రాజు ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాలు చేయలేడా..?
TeluguStop.com
టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు ( Dil Raju )ప్రస్తుతం భారీ సినిమాలను చేయడమే కాకుండా చిన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక తను చేసిన గేమ్ చేంజర్ సినిమా( Game Changer Movie ) భారీ డిజాస్టర్ బాట పట్టడంతో ఆయన భారీగా నష్టపోయాడు.
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో( Sankrantiki Vastunnam ) భారీ విజయాన్ని అందుకొని ఆ నష్టాన్ని ఇందులో భర్తీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇకమీదట ఆయన భారీ సినిమాలు చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చేస్తానని చెబుతుండడం విశేషం.
"""/" /
శంకర్ వల్ల దిల్ రాజు చాలా వరకు నష్టపోయాడనే చెప్పాలి.
మరి శంకర్ మాత్రం తనకున్న కమిట్మెంట్ ప్రకారం తను ఆ సినిమా చేశానని ఐదు గంటల ఫుటేజ్ తో సినిమా వచ్చిందని తను బాగా తీసిన షాట్స్ కొన్ని ఫైనల్ వెర్షన్ లో మిస్ అయ్యాయి అంటూ చెబుతూ ఉండడం విశేషం.
ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి భారీ ప్రొడ్యూసర్ ఈ సినిమా వాళ్ల కోలుకోలేని దెబ్బ తన్నాడనే చెప్పాలి.
"""/" /
మరి ఇక మీదట ఆయన భారీ సినిమాలో చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దిల్ రాజు 200 కోట్ల బడ్జెట్ లోపల వుండే సినిమాలను మాత్రమే ఎక్కువగా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కంటే యంగ్ హీరోలతో సినిమాలు చేయడమే ఉత్తమం అని అతను భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందువల్లే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు అందరితో తన బ్యానర్లో సినిమా చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాడు.
మరి రాబోయే రోజుల్లో కూడా వీళ్లతో సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.
చూడాలి మరి ఆయన అనుకున్నట్టుగా సక్సెస్ లు కొడుతాడా లేదా అనేది.
ఎన్ఆర్ఐ కోటా మెడికల్ సీట్లలో అక్రమాలు .. బెంగాల్‌లో ఈడీ దాడులు