రెండు వారాలు, 150 కోట్లు... దిల్ రాజు లెక్కలు చూస్తే అవాక్కవ్వాల్సిందే ?

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు అంటే ఒక బడా బ్రాండ్ అనే చెప్పాలి.

సక్సెస్ఫుల్ నిర్మాతగా అయినా అచ్చోచ్చిన డిస్ట్రిబ్యూటర్ గా అయినా ఈయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా గుర్తింపు పొందారు.

ఈయన సమర్పణలో సినిమా వస్తుంది అంటే అది ఆల్మోస్ట్ లాభాలు కురిపించే సక్సెస్ఫుల్ చిత్రమే అయ్యుంటుందని ఫిక్స్, అంతగా తన ముందు చూపుతో పేరు ప్రఖ్యాతులను గాంచారు దిల్ రాజు.

స్టార్ హీరోలందరి చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు ఎదిగారు దిల్ రాజు.

దర్శకుడు రాజమౌళికి ఎలా అయితే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉందో దిల్ రాజు కు కూడా సెపరేట్ బ్రాండ్ ఉంది.

ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా దిల్ రాజు ది డబుల్ రోల్.రెండింటిలోనూ విజయాన్ని అందుకున్న ఘనత ఈయనకు దక్కింది.

ప్రాజెక్ట్‌ ప్రాఫిట్‌లో ఉంటేనే నా దృష్టిలో అది సక్సెస్‌ఫుల్‌ చిత్రం అన్నది ఈయన ఫార్ములా అంటుంటారు, అదే ఆయన విజయ రహస్యం అని కూడా చెబుతుంటారు.

అందుకే ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి అంటే ముందుగా అన్ని ప్రణాళికలు వేసుకుని వర్కౌట్ అవుతుంది అనుకుంటూనే ముందుకు వెళతారు లేదంటే లేదు.

అంత పక్కా ప్లానింగ్ వలనే ఏమో ఎక్కువగా లాభాలను అర్జిస్తారు.ఇక నైజాంలో సక్సెస్ అంటే కాస్త కష్టమైన విషయమే.

అయినా అక్కడ కూడా తన బ్రాండ్ పవర్ ను చూపుతూనే ఉన్నారు దిల్ రాజు.

నైజాం కింగ్ గా మన్నలను పొందుతున్నారు .ఇక ఈ మధ్య కాలంలో నైజాం నుండి ఈయన అందుకున్న లాభాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ ఏడాది నైజాం ప్రాంతంలో స్టార్ హీరోల చిత్రాలను వరుస పెట్టి కొన్నారు దిల్ రాజు.

అయితే ఆ మూవీస్ ఒక్కోటిగా విడుదల అయ్యి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ను లాభాల వర్షంతో ముంచెత్తాయి.

"""/" / ఈ మధ్యనే ఘన విజయాన్ని అందుకున్న "అఖండ" చిత్ర హక్కులను నైజాం ప్రాంతం నుండి డిస్ట్రిబ్యూటర్ గా 8 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ మూవీ నైజాం ప్రాంతం లోనే సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ ప్రాంతం నుండి 20 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

దాంతో ఆ సినిమాకి గాను పెట్టుబడి పోగా నైజాం ప్రాంతంలో 12 కోట్ల లాభం దిల్ రాజు అకౌంట్ కి ట్రాన్ఫర్ అయ్యింది అన్నమాట.

"""/" / అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్ మూవీ హక్కులను నైజం ప్రాంతం హక్కులను దిల్ రాజు 30 కోట్లకు కొనుగోలు చేయగా ఆ మూవీ మొత్తంగా నైజం ప్రాంతం నుండి 36 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

దాంతో అక్కడ 6 కోట్ల లాభం వచ్చింది. """/" / ఇక జక్కన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా హక్కులను నైజం ప్రాంతం కొరకు 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, ఈ మూవీ అన్ని ప్రాంతాలతో పాటు నైజాం ప్రాంతంలోను తన పవర్ చూపింది.

నైజం ప్రాంతం నుండి భారీ మొత్తంలో 110 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో పెట్టుబడి పోగా ఏకంగా 45 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ప్రాంతం నుండి లాభాలను అందుకున్నారు.

"""/" / అయితే రాధే శ్యామ్ మూవీ ఒక్కటి మాత్రం ఈయనకు నష్టాలను తెచ్చింది.

నైజాం ప్రాంతం నుండి ఈ మూవీ హక్కులను దిల్ రాజు 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా .

ఈ మూవీ కేవలం అక్కడ 23 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టడంతో నైజంలో 7 కోట్లు నష్టం వచ్చినట్లు సమాచారం.

ఏదేమైనా ఓవరాల్ గా చూస్తే నైజం ప్రాంతంలో ఈసారి దిల్ రాజు భారీగానే లాభాలను అందుకుని నైజం కింగ్ గా ముద్ర వేసుకున్నారు.

ఈ విధంగా కేవలం రెండు వారల వ్యవధిలో నైజాంలో 150 కోట్ల లాభాలను అందుకున్నారు దిల్ రాజు.

వయసు పెరిగిన బన్నీలో మార్పు రాలేదు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు!