Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఒకే నెలలో తారక్, చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?

టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి మనందరికీ తెలిసిందే.

ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్.

ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోలు ఎవరికి వారు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇద్దరు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.అయితే ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం దేవర( Devara ) మూవీలో నటిస్తుండగా, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలాకు వారి సినిమాలకు సంబందించిన ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.గేమ్ ఛేంజర్( Game Changer ) ఆలస్యానికి కారణం దర్శకుడు శంకరే అయినా దానికి సంబంధించి అభిమానుల నుంచి ఎప్పటికప్పుడు నిరసన ఎదురుకుంటున్నది మాత్రం నిర్మాత దిల్ రాజే.

( Producer Dil Raju ) నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్ లో ఆయన అతిథిగా హాజరయ్యారు.

ఇంకొక్క నాలుగైదు నెలలు ఓపిక పడితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన ప్యాన్ ఇండియా మూవీని చూసుకోవచ్చని మంచి గుడ్ న్యూస్ చెప్పారు.

తేదీని స్పష్టంగా చెప్పకపోయినా ఇన్ సైడ్ టాక్ ప్రకారం అక్టోబర్ 31 లాక్ చేసుకున్నారని, కాకపోతే శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని టాక్.

"""/" / తాజాగా జరగండి జరగండి పాట( Jaragandi Jaragandi Song ) గతంలో లీక్ అవ్వడం వల్ల ఇవాళ మీకు అంత ఎనర్జీ ఇవ్వలేకపోయిందని ఒప్పుకున్న దిల్ రాజు నాలుగైదు రోజుల తర్వాత మాస్ లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఉంటుందని తేల్చేశారు.

మొత్తం మూడు పాటలు థియేటర్ కుర్చీల్లో కూర్చుని చూడలేనంత గొప్పగా డాన్సులు ఉంటాయని ఊరించారు.

దిల్ మావా అప్డేట్ అంటూ నన్ను తిట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, శంకర్( Shankar ) అనే శాటిలైట్ సిగ్నల్ ఇస్తే తప్ప నేను ఏం చేయలేనని జరుగుతున్నది వివరించే ప్రయత్నం చేశారు.

"""/" / రెండు నెలల్లో మొత్తం పూర్తవుతుందని చెప్పారు.ఇండియన్ రెండు భాగాలను గేమ్ ఛేంజర్ తో సమాంతరంగా తీయడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్ అయినా ఎవరూ దాన్ని బయటికి చెప్పరు చెప్పలేరు.

మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతుండగా, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది.

మరి ఒకే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాలు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి మరి.

మామిడిపండ్లు తిన్న వెంట‌నే నీరు తాగుతున్నారా.. జాగ్ర‌త్త‌!