డిజిటల్ ఓటర్ ఐడి కార్డును ఆన్ లైన్ నుంచి సింపుల్ గా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

2024 జనరల్ ఎలక్షన్స్ కోసం డిజిటల్ ఓటర్ ఐడి కార్డు ను( Digital Voter ID Card ) సింపుల్ గా ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.

? చాలామంది ప్రజలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియక కాస్త ఇబ్బంది పడుతూ ఆన్లైన్ లో తెగ సెర్చ్ లు చేసేస్తున్నారు.

అయితే డిజిటల్ ఓటర్ ఐడి కార్డును సింపుల్ గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది.

ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా( Election Commission Of India ) వెబ్సైట్ తో పాటు యాప్ ను కూడా అందించింది.

ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ Https://voters.ECI.

Gov!--in/ ను ఓపెన్ చేయాలి.వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజీలో కుడి వైపు భాగం చివరలో E-Epic Download అనే బాక్స్ పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

ఒకవేళ లాగిన్ అవ్వని వారు మాత్రం లాగిన్ పేజీకు మళ్ళించబడతారు. """/" / ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఎప్పుడు లాగిన్ అవ్వకుంటే.

మీ మొబైల్ నెంబర్ తో కొత్త అకౌంట్ ద్వారా సైన్ అప్ కావచ్చు.

ఇలా లాగిన్ చేసిన తర్వాత E-Epic Download పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

"""/" / ఇక ఆ కొత్తపేటలో ఓటర్ ఐడీ కి సంబంధించిన EPIC నెంబర్ ఎంటర్ చేయాలి.

కింది బాక్సులో రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి.ఇక పక్కనే ఉన్న సెర్చ్ బాక్స్ పై క్లిక్ చేస్తే మీ ఓటర్ ఐడి కార్డ్ వివరాలను కనిపిస్తాయి.

ఆ వివరాల కింద OTP కోసం రిక్వెస్ట్ చేయాలి.ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.

ఆ OTP ను ఎంటర్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే క్షణంలో డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.

ఓడిపోతే కొత్త ప్రయాణం మొదలుపెట్టు… ఓటమి గురించి ఆలోచించకు: సమంత