చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు..!!

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబునాయుడు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టుల పేరుతో వచ్చిన లెటర్ నిజం కాదని అన్నారు.చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతుంది.ఎంతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.

జైలులో మొదటినుంచి చంద్రబాబుకు 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది.అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి.

కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం.చంద్రబాబుకి ఎలర్జీ తగ్గింది.

"""/" /   ఈ క్రమంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి రెండుసార్లు కుటుంబ సభ్యులకు లెటర్లు కూడా రాయడం జరిగింది.

చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సూచనలు ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేయడం జరిగింది.

ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపినట్టు డీఐజీ పేర్కొన్నారు.చంద్రబాబుకి కంటి పరీక్షలు కూడా చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆయన కుడి కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.కొంత సమయం తర్వాత చేయవచ్చని తెలిపారు.

చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తప్పుడు రిపోర్టులు బయటకు ఇవ్వడం లేదని.పూర్తి వివరాలు కోర్టుకు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.

పవిత్ర కుంభమేళాలో హైటెక్ టచ్.. ఒంటె వీపున QR కోడ్ చూసి షాకైన జనం!