జనావాసాల మధ్య వైన్స్ షాపులతో ఇబ్బందులు

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల( Munugodu ) కేంద్రంలోని చిట్యాల రోడ్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.

ఇక్కడ జనావాసాల మధ్య ఎన్.వి.

ఎస్.ఆర్,ఎస్.

ఆర్ వైన్స్ షాపులు ఉండడంతో ప్రయాణికులు,ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా ఈ దారిలో వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారు.

దీనికి తోడు దిగుమతి పేరుతో అనేక పెద్ద వాహనాలు ఇక్కడే పార్క్ చేయడంతో ట్రాఫిక్ కు మరింత ఇబ్బంది ఏర్పడుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.

పట్టణం మధ్యలో ఉన్న వైన్స్ దుకాణాలకు జనావాసాల దూరంగా తరలించాలని నెత్తి నోరు బాదుకున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్( Excise Department ) కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి వైన్స్ షాపులను ఊరికి దూరంగా తరలించాలని కోరుతున్నారు.

వైరల్ వీడియో: పార్లమెంట్‌కు సైకిల్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు..