చలికాలంలో తేనె తీసుకుంటున్నారా? మరి ఇవి మీకు తెలుసా?
TeluguStop.com
తేనె.ఎంత మధురంగా ఉంటుందో అంతే ఎక్కువ పోషకాలనూ కలిగి ఉంటుంది.
విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్యానికి తేనె బోలెడన్ని ప్రయోజనాలను అందించగలదు.
అందుకే సర్వ రోగ నివారిణిగా పిలవబడే తేనెను చాలా మంది ఉదయం వేడి నీటిలో కలిపి తీసుకుంటారు.
అయితే ప్రస్తుత ఈ చలి కాలంలో తేనె అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ఈ సీజన్‌లో వేధించే పలు అనారోగ్య సమస్యలను తేనెతో సులభంగా నివారించుకోవచ్చు.
మరి ఆలస్యమెందుకు తేనె ఏ ఏ విధంగా యూజ్ అవుతుందో చూసేయండి.చలి కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు గురై నానా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే అలాంటి సమయంలో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ లవంగాల పొడి కలిపి తీసుకోవాలి.
"""/"/
ఇలా చేయడం వల్ల.వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక వ్యవస్థను పఠిష్టం చేసి జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
అలాగే సైనస్ ఉన్న వారు చలి కాలంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు.
అయితే రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌కి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే.
సైనస్ లక్షణాల నుంచి విముక్తి లభిస్తుంది.ఈ సీజన్‌లో చలి కారణంగా చాలా మంది వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తూ బరువు పెరిగి పోతుంటారు.
అయితే ప్రతి రోజు ఉదయాన్నే ఒక స్పూన్ తేనెకు అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది.
తద్వారా బరువు అదుపులో ఉంటుంది.ఇక ఏదైనా హెర్బల్ టీలో తేనె కలిపి తీసుకుంటే మానసిక సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో వ్యర్థాలన్నీ బయటకు వెళ్తాయి.మరియు గుండె ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.
దటీజ్ బాలయ్య… అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య?