ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భిన్న తీర్పులు..!

ఫామ్ హౌజ్ కేసు విచారణలో మరో ట్విస్ట్ నెలకొంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు బెంచ్ లు భిన్న తీర్పులు వెలువరించాయి.

నిందితుల రిమాండ్ పై ఏసీబీ కోర్టు తీర్పును ఓ బెంచ్ తప్పుపట్టింది.అదేవిధంగా నిందితులను రిమాండ్ లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ పిటిషన్ ను విచారించిన మరో బెంచ్ పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.

మునుగోడు ఉపఎన్నిక తర్వాత 4వ తేదీన తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించింది.దీంతో సైబరాబాద్ పోలీసులు ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో పడ్డారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.