సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్‎లో విభేదాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ తో కలిసి నాయకులు పొన్నం, ప్రవీణ్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.

తుక్కుగూడ సభా వేదికగా పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డ్స్ తో నాయకులు ర్యాలీ చేస్తుండగా వివాదం చెలరేగిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో తమ నేతలకు మద్ధతుగా అటు పొన్నం, ఇటు ప్రవీణ్ రెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు.

ఘర్షణ కాస్తా తీవ్రరూపం దాల్చడంతో మాజీ ఎంపీ పొన్నం, ప్రవీణ్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.కాగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం, ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్11, బుధవారం 2024