తుని టికెట్ విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు

కాకినాడ జిల్లాలోని టీడీపీలో యనమల సోదరుల మధ్య విభేదాలు రాజుకున్నాయి.అన్న రామకృష్ణుడు, తమ్ముడు కృష్ణుడి మధ్య వివాదం చెలరేగింది.

ఒకరిపై ఒకరు సై అంటే సై అనుకుంటున్నారు.తుని టీడీపీ సీటు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది.

టీడీపీ తరపున సీటు తన కుమార్తెకు ఇస్తున్నట్లు యనమల రామకృష్ణుడు ఇటీవల సంకేతాలు ఇచ్చారు.

అయితే రామకృష్ణుడి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తమ్ముడు యనమల కృష్ణుడు తొండంగి టీడీపీ నేతకి ఫోన్ చేశారని సమాచారం.

పార్టీ కోసం తాము కష్టపడితే సీటు మాత్రం కుమార్తెకు ఎలా ఇస్తారో అడగాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రతీ గ్రామం నుంచి 40 మంది వెళ్లి రామకృష్ణుడిని ప్రశ్నించాలని డిమాండ్ చేసారు.

కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని చెప్పాలని ఫోన్ లో విజ్ఞప్తి చేశారని సమాచారం.

ఈ క్రమంలో కృష్ణుడు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో.. ఇందుకే కాదయ్యా నిన్ను ‘క్రికెట్ దేవుడు’ అనింది!