సూర్య మరియు కార్తిలకు ఉన్న పెద్ద తేడా ఇదే

సూర్య మరియు కార్తీ ( Surya ,Karti )కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోలకు నా డిమాండ్ అంతా కాదు వీరి క్రేజీ ఎలా ఉంటుందో తమిళనాడు మొత్తం తెలుసు.

తండ్రి శివకుమార్( Sivakumar ) పేరు ఏమాత్రం వాడుకోకుండా ఈ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఎదిగిన వైనం చూస్తే ముచ్చటేస్తుంది.

సూర్య కార్తీ ఇద్దరు కూడా ఎవరికివారు మంచి నటులే కార్తికే సూర్య లేదా తండ్రి అవసరం ఏ రోజు రాదు.

అలాగే సూర్య కూడా ఎప్పుడు తన కుటుంబం పేరు చెప్పుకొని గొప్పలు చెప్పుకోడు.

ఉన్నదంతా దానాలు ధర్మాలు చేస్తారు.తమ సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ వెల్ఫేర్ కే వెళ్ళిపోతుంది.

తమ కుటుంబాల గురించి కూడా ఒక్క గాసిప్ కూడా రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

"""/" / తమ అభిమానులు ఎవరైనా చనిపోతే సొంత ఇంటి సభ్యుడు చనిపోయినంత బాధపడుతూ ఉంటారు.

వారి ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి తోచినంత సహాయం చేసి వస్తారు.ఈ విషయంలో స్టార్ హీరోలకు దీటుగా సూర్య మరియు కార్తీలకు మంచి పేరు లభించింది.

ఇక చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన ఈ ఇద్దరికి విషయంలో కొన్ని క్వాలిటీలు ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

సూర్యా పెళ్లి తర్వాత చాలా జెంటిల్మెన్ గా మారిపోయాడట అంతేకాదు చాలా సాఫ్ట్ నేచర్ కలిగి ఏదైనా చెప్తే వినే ఓపిక ఉంటుందట.

సినిమాల విషయానికి వచ్చేసరికి సొంత భార్య అయినా సరే తన కాళ్ళ మీద తానే ఎదగాలని అనుకుంటాడట.

భర్త గొప్ప భార్య తక్కువ అనే భేదం ఉండదట.అందుకే జ్యోతిక సూర్య ఇద్దరూ తమ కెరియర్ ను చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు.

"""/" / ఇక కార్తి విషయానికొచ్చే సరికి ఇతడు ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట సూర్యలాగా సాఫ్ట్ గా ఏది చెప్పినా వినే టైప్ కాదట ప్రతి విషయాన్ని ఖండిస్తాడట.

తనని కన్విన్స్ చేయడం అంత ఈజీ కూడా కాదట అయితే ఈ విషయాలన్నీ చెప్పింది మరెవరో కాదు సూర్య కార్తిల ఏకైక ముద్దుల చెల్లెలు బృంద.

ఆమె ప్రస్తుతం సింగర్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది అన్నలిద్దరూ పెద్ద స్టార్ హీరోలైనా కూడా ఏ రోజు తన చెల్లి కోసం ఒక అవకాశం కూడా ఇవ్వలేదట.

ఎవరికి వారు వారి సొంత కాళ్ల మీద ఎదగాలని వారు కోరుకుంటున్నారట.

దేవర విషయం లో ఎన్టీయార్ ను భయపెడుతున్న అనిరుధ్…