పోస్టాఫీసా? బ్యాంకా? ఎక్క‌డ డ‌బ్బులు త్వ‌రగా డ‌బుల్ అవుతాయో తెలుసా?

ఎవ‌రైనా సరే త‌మ డ‌బ్బు త్వ‌ర‌గా డబుల్ అయ్యేచోట ఇన్వెస్ట్ చేయాల‌ని అనుకుంటారు.

ఇటువంటి స‌మ‌యాల్లో పోస్టాఫీసులో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిదా లేక‌ బ్యాంక్ ఎఫ్‌డిపై ఆధారపడాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతుంటారు.

దానికి స‌మాధానం ఇప్పుడు తెలుసుకుందాం.కిసాన్ వికాస్ పత్ర అత్యధిక వడ్డీ అందించే పెట్టుబడులలో ఒకటిగా పరిగణించాలి.

చాలామంది దీనిలోనే పెట్టుబడి పెడుతున్నారు.కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో పెట్టుబడిపై 6.

9% వడ్డీని వ‌స్తుంది.ఇది బ్యాంకులో ఎఫ్‌డీతో పొందే వడ్డీ కంటే చాలా ఎక్కువ.

విశేషమేమిటంటే కేవీపీలో మీరు 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.గరిష్టంగా మీ బడ్జెట్‌కు అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు.

18 ఏళ్లు నిండిన‌ వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.రెండున్నరేళ్ల తర్వాత దానిలో డబ్బు తీసుకోవచ్చు.

కాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై గరిష్టంగా 5.

40% వడ్డీని ఇస్తుంది.మీరు ఎస్‌బీఐలో 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీ చేయవచ్చు.

కేవీపీలోపెట్టుబడిపై గరిష్ట వడ్డీ 6.90%.

ఎస్‌బీఐ ఎఫ్‌డీలో గరిష్ట వడ్డీ 5.40% పొంద‌వ‌చ్చు.

మీరు కేవీపీలో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, డబ్బు రెట్టింపు కావడానికి దాదాపు 10 సంవత్సరాల 4 నెలల సమయం పడుతుంది.

అదే సమయంలో మీరు ఎస్‌బీఐలో డబ్బు పెట్టుబడి పెడితే, డబ్బు రెట్టింపు కావడానికి 13 సంవత్సరాల 4 నెలల సమయం పడుతుంది.

Bhujangarao, Tirupattana : ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు కస్టడీ..!