విజయమ్మ కు పెద్ద కష్టమే వచ్చిందే ? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ( YS Vijayamma )కు ఎప్పుడు పెద్ద కష్టమే వచ్చింది .

రాజకీయంగా తన కుమార్తె , కుమారుడు వేరువేరు రాజకీయ దారులు ఎంచుకోవడంతో, షర్మిల ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు.కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు.

కుమారుడు వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి , ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ జగన్ ను టార్గెట్ చేసుకుని షర్మిల ( Sharmila )తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

"""/" /  రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .

ఈ క్రమంలో కుమారుడు, కుమార్తెలను ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో విజయమ్మ ఉన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) వారసత్వాన్ని షర్మిల ,జగన్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం షర్మిల జగన్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ ఉండడంతో, ఎవరు వైపు ఉండాలో తేల్చుకోలేక విజయమ్మ ఒత్తిడికి గురవుతున్నారు.

ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయంలో జగన్ పక్కనే విజయమ్మ ఉన్నారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయంలో షర్మిల పక్కనా విజయమ్మ ఉన్నారు.

గత ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా రాష్ట్రమంతటా విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

"""/" / ఎన్నికల్లోను తన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిందిగా విజయమ్మ పై జగన్ ఒత్తిడి ఉంటుంది.

అలాగే షర్మిల సైతం కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి రావలసిందిగా విజయమ్మపై ఒత్తిడి ఉంటుంది.

దీంతో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో విజయమ్మ ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచనతో విజయమ్మ ఉన్నారట.

మొత్తంగా ఈ ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు విజయమ్మకు, అటు కుమారుడు, ఇటు కుమార్తె నుంచి వచ్చే ఒత్తిడి తీవ్రంగానే ఉండబోతుంది.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?