తగ్గేదేలే, పుష్ప టామ్ అండ్ జెర్రీ వెర్షన్ చూశారా.. చూస్తే ఫిదా అవుతారు!

సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది.

ఈ సినిమాపై నెటిజన్లు ఆకట్టుకునే మీమ్స్, ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసి మరీ సోషల్ మీడియాలో వదులుతున్నారు.

వాటిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయి పోతున్నారు.అయితే తాజాగా తగ్గేదేలే అంటూ ఓ టామ్ అండ్ జెర్రీ వెర్షన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

టామ్ అండ్ జెర్రీ షోని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.అలాంటిది టామ్ అండ్ జెర్రీ వెర్షన్ లో ఇప్పుడు పుష్పలోని తగ్గేదే లే, హుగ్ స్టెప్ సీన్స్, శ్రీవల్లి, సామీ సామీ పాటలు రావడంతో నెటిజన్లు వావ్ అంటున్నారు.

అన్ని సోషల్ మీడియాల్లోనూ ఈ వీడియో వైరల్ అవుతోంది. """/" / వైరల్ అవుతున్న వీడియోలో మనం పుష్ప సినిమాలోని ఐకానిక్ సీన్స్ ని టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్ రిపీట్ చేయడం చూడొచ్చు.

టామ్ క్యారెక్టర్ శ్రీవల్లి పాటలో రష్మిక వేసిన మోస్ట్ ఫేమస్ స్టెప్ వేయడం కూడా గమనించవచ్చు.

ఇదే పాటలో అల్లు అర్జున్ ఒకే చోట కాళ్లను ఆడిస్తూ డాన్స్ చేసే స్టెప్ ను జెర్రీ అద్భుతంగా వేయడం కూడా మనం గమనించొచ్చు.

ఇంకా చెప్పుకుంటూ పోతే, అల్లు అర్జున్ లాగా టామ్ ఒక చెట్టుని ఒక్క వేటుతో నరికేయడం, సిగరెట్ తాగడం, గొడ్డలిని చకచకా తిప్పడం చూడొచ్చు.

ఇక జెర్రీ రష్మిక లాగా నాట్యం చేయడం, బన్నీ లాగా ఒక చెట్టుపై నడవటం, పుష్ప పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదే లే అని డైలాగ్స్ చెప్పడం భలే క్యూట్ గా అనిపించాయి.

ఈ వీడియోని యూట్యూబ్ లో Edits Mukeshg అనే ఒక ఛానల్ షేర్ చేసింది.

దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్లు వచ్చాయి.ఈ అద్భుతమైన వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ పోస్టర్ పై అలాంటి విమర్శలు.. కాపీ కొట్టారంటూ?