హీరోయిన్ రాశి భర్త ఎవరో తెలుసా?

హీరోయిన్ రాశి.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.1980లోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకొని అద్భుతంగా నటించిన హీరోయిన్ రాశి.

అతి తక్కువ కాలంలోనే తన అందంతో అందరి మతి పోగొట్టింది ఈ నటి.

అప్పట్లో కాస్త అందాల ఆరబోత చేసిన నటి ఎవరు అంటే కళ్లు మూసుకొని చెప్పేస్తారు హీరోయిన్ రాశి అని.

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

అయితే నిర్మాతగా వ్యవహరించిన సమయంలో కథల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైన రాశి ఆతర్వాత పెళ్లి చేసుకొని కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

ఆతర్వాత తల్లి పాత్రతో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది రాశి.రి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన రాశి ప్రస్తుతం జెమిని టీవిలో కొన్ని సీరియల్స్ లో నటిస్తుంది.

వెండితెర నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఈ భామ భర్త ఎవరో మీకు తెలుసా? 2005లో ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.

అతను ఎవరో కాదు శ్రీముని.అతని సినిమాలు పెద్దగా ఏవి లేకపోయినప్పటికీ ఆమె అతనికి ప్రపోజ్ చేసి ప్రేమించి పెళ్లిచేసుకుంది.

వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది.ప్రస్తుతం వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తున్న రాశిని పెళ్లి చేసుకొనేందుకు ఎంతోమంది బడాబాబులు ముందుకు వచ్చిన ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అనందంగా జీవిస్తుంది.

ఏది ఏమైనా ప్రేమకు ఉన్న పవర్ డబ్బుకు లేదని నిరూపించింది రాశి.

అలాంటి మ్యూజిక్ కావాలంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రవిగారు వింటున్నారా?