ఈ ఫోటోలో వెంకటేష్ తో ఉన్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా…?
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన "జోష్" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో నాగ చైతన్య కి సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో అక్కినేని నాగ చైతన్య తో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే అక్కినేని నాగచైతన్యకు విక్టరీ వెంకటేష్ స్వయాన మేనమామ.దీంతో ఇటు వెంకటేష్ అభిమానులు ఆటు నాగచైతన్య అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ షేర్ చేస్తున్నారు.
అంతేగాక దగ్గుబాటి బాసు తో అక్కినేని చిన్నోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న "నారప్ప" ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం తమిళం లో మంచి విజయం సాధించినటువంటి "అసురన్" అనే చిత్రానికి రీమేక్ గా ఉంది.
కాగా అక్కినేని నాగ చైతన్య ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న "లవ్ స్టోరీ" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయి విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేశారు.
రాహుల్ అమెరికా పర్యటన : సిక్కులపై వ్యాఖ్యలు… గురుపత్వంత్ మద్ధతు, మండిపడ్డ బీజేపీ