ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో చెప్పుకోండి… చుద్దాం…!

తెలుగులో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన "పెళ్లి చూపులు" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన  టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే విజయ్ దేవరకొండ అంతకు ముందే పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

కానీ పెళ్లి చూపులు చిత్రం మంచి హిట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ కి మళ్ళీ వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు.

దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ దాదాపుగా స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా విజయ్ దేవరకొండ కి సంబంధించిన  కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా  ఓ చిత్రంలో నటించినప్పుడు తీసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో కొంతమంది ఈ ఫోటోలను బాగానే సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఫైటర్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ మరియు సినీ నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

నాకు సమయం వస్తుంది…. అప్పుడే సమాధానం చెబుతా… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!