ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లెలు అని మీకు తెలుసా…?
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినటువంటి అరుంధతి చిత్రంలో "విడుదల.
బిడ్డకు విడుదల" అనే డైలాగ్ చెబుతూ తన రూపంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టినటువంటి నటి సుభాషిని గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.
అయితే ఈమె సినిమా కుటుంబ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తెలుగులో పెద్దగా సినీ అవకాశాలను తెలుగులో దక్కించుకోలేకపోయింది.
అయితే ఈమె తెలుగులో సహజ నటిగా పేరుపొందినటువంటి నటి జయసుధ సోదరి అని ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో అప్పట్లో సుభాషిని రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో సుభాషిని హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేక పోగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసింది.
చివరికి ఆ పాత్రలు కూడా సుభాషిని కి గుర్తింపు తీసుకురాలేదు.దీంతో సుభాషిని అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపిస్తుంటుంది.
అయితే సుభాషిని అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే నాగాస్త్రం అనే ధారావాహిక లో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వెండితెర మీద పెద్దగా రాణించలేక పోయినటువంటి సుభాషిని బుల్లి తెరపై మాత్రం బాగానే ఆకట్టుకుంది.
నాగాస్త్రం సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధారావాహికలలో నటించలేదు.అయితే ఈ మధ్యకాలంలో సుభాషిని కర్ణాటక లోని బెంగుళూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
బోన్ మారోపై ఎన్ఆర్ఐ వైద్యుల సంఘం స్పెషల్ డ్రైవ్ … దాతలను పెంచడమే లక్ష్యం