మొక్క‌జొన్న అంటే ఎంత ఇష్ట‌మున్నా ఇలా మాత్రం తిన‌కూడ‌దు!

ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే మొక్క‌జొన్న పొత్తులంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.

పిల్ల‌లు, పెద్ద‌లు తేడా లేకుండా దాదాపు అంద‌రూ మొక్క‌జొన్న‌ను ఇష్ట‌ప‌డుతుంటారు.మొక్క‌జొన్న పొత్తులు చ‌క్క‌టి రుచే కాదు విటమిన్ ఇ, విట‌మిన్ బి, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా మొక్క‌జొన్న గింజ‌లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటాయి.జంక్ ఫుడ్స్ కు బదులుగా మొక్కజొన్న గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

మొక్కజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి విముక్తి ల‌భిస్తుంది.కంటి చూపు పెరుగుతుంది.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య కంట్రోల్ అవుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే మొక్క‌జొన్న‌తో చాలా ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. """/" /</ కానీ, ఎంత ఇష్ట‌మున్నా.

ఎన్ని ప్ర‌యోజ‌నాలు అందించినా మొక్క‌జొన్న‌ను తీసుకునే క్ర‌మంలో త‌ప్ప‌కుండా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా కొంద‌రు ఉడికి ఉడ‌క‌ని మొక్క‌జొన్న‌ను తింటుంటారు.ప‌చ్చిగా లేదా ఉడికి ఉడ‌క‌ని మొక్క‌జొన్న‌ను పొర‌పాటున కూడా తిన‌కండి.

ఎందుకంటే, ఇలా తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు దెబ్బ తింటుంది.

దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపు నొప్పి, డ‌యేరియా వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అలాగే కొంద‌రు మొక్క‌జొన్న‌ను స‌రిగ్గా న‌మ‌ల‌కుండా మింగేస్తుంటారు.ఇలా చేసినా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఇక కొంద‌రు టేస్ట్‌గా ఉన్నాయ‌ని చెప్పి అధిక మొత్తంలో మొక్క‌జొన్న పొత్తుల‌ను లాగించేస్తుంటారు.

ఇలా చేస్తే ఆరోగ్య లాభాలు కాదు.న‌ష్టాలే ఎక్కువ ఏర్ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, రోజుకు ఒక‌టికి మించి మొక్క‌జొన్న పొత్తును తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

డీజే టిల్లు క్యూబ్(3) లో నటించనున్న కీలకమైన నటుడు…