సమ్మర్‌లో ఏ నీటితో స్నానం చేయాలో తెలుసా?
TeluguStop.com
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచింది.సెకెండ్ వేవ్‌లో ఈ మహమ్మారి వికృత రూపం చూపిస్తుండడంతో.
భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి.కరోనా పోలేదు.
ఇంతలోనే సమ్మర్ వచ్చేసింది.ఏప్రిల్ నెలలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
బానుడు భగ భగలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.అయితే వేసవిలో కూల్ కూల్‌గా ఉండేందుకు చాలా మంది చన్నీటితో స్నానం చేస్తుంటారు.
కానీ, వేసవి కాలంలో చన్నీటి స్నానం చేయొచ్చా అంటే.వద్దనే చెబుతున్నారు నిపుణులు.
చన్నీటి స్నానం వల్ల బాడీ టేంపరేచర్ మరింత పెరుగుతుంది.దాంతో అధిక చెమటలు, చికాకు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అలాగని మరీ వేడిగా ఉండే నీటితో కూడా స్నానం చేయకూడదు.మరి సమ్మర్‌లో ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదీ అంటే.
గోరు వెచ్చని నీరే అంటున్నారు. """/" /
వేసవిలో గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.
శరీర ఉష్ణోగ్రతులు అదుపులో ఉంటాయి.అధిక చెమటలు పట్టకుండా ఉంటాయి.
ఒత్తిడి, తలనొప్పి, వంటి సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఎండల దెబ్బలకు బాగా అలసి పోయిన వారు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.
మళ్లీ ఉత్సాహంగా, ఉల్లాసంగా మారుతారు.అలాగే వేసవిలో చాలా మంది లోబీపీ లేదా హైబీపీతో బాధ పడుతుంటారు.
అయితే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
అంతేకాదు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి.ఇక గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.
రక్త సరఫరా పెరుగుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఇక కండరాల నొప్పులతో బాధ పడే వారు.గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే త్వరగా ఉపశమనం పొందుతారు.
పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?