గాలి ఊదే ముందు బెలూన్ కడగాలని మీకు తెలుసా?

ఫంక్షన్ ఏదయినా కావచ్చు.అది ఎంగేజ్‌మెంట్ అయినా, రిటైర్మెంట్ పార్టీ అయినా, బాబీ పుట్టినరోజు వేడుకలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు ఇలా కారణం ఏదైనా ముందుగా అలంకరణ చేసేటప్పుడు అందరికీ గుర్తొచ్చేవి బెలూన్స్( Balloons ).

అవును, ఇపుడు దాదాపుగా చాలామంది వివిధ రకాల ఫంక్షన్లలో బెలూన్‌లను విరివిగా వాడుతున్నారు.

అయితే ఈ క్రమంలో మనలో చాలా మంది ప్యాకెట్ నుండి బెలూన్‌ను తీసి వెంటనే దాంట్లో గాలి ఊదడం ప్రారంభిస్తారు.

అయితే బెలూన్‌లను ప్యాకెట్‌లోంచి బయటకు తీయకుండా వాటిని కడగకుండా గాలి ఊదడం వలన ఆరోగ్యంపైన ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

"""/" / అవును, “డేనియల్ బియర్డెన్”( Daniel Bearden ) అనే మహిళ టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.

బెలూన్‌లను కడగకుండా వాటిని గాలి ఊదడం ఎంత ప్రమాదమో కళ్ళకు కట్టినట్టు చూపించింది.

చాలా మంది వ్యక్తులు తమ నోటి నుండి గాలితో బెలూన్‌ను నింపుతారు.అయితే అలా బెలూన్లను ఊదినపుడు దానిమీద వున్న ధూళి, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి వివిధ వ్యాధులకు కారణమవుతుందని వివరించింది.

డానియెల్ పోస్ట్ చేసిన వీడియోలో ఆమె బెలూన్‌లను నీటితో ఒక టబ్‌లో నానబెట్టి, డిటర్జెంట్ జోడించినట్లు మనం చూడవచ్చు.

డిటర్జెంట్ కలిపిన తరువాత ఆమె దానిని పూర్తిగా శుభ్రం చేశారు.ఆ తర్వాత బెలూన్‌పై అంటుకున్న మురికి నీటిలో కనిపించడం ప్రారంభించింది.

"""/" / అవును, మీరు ఊహించింది నిజమే.బెలూన్‌లను కడిగిన తర్వాత నీరు ఎంత మురికిగా మారిందో మీరు చూడవచ్చు.

బెలూన్లపై హానికరమైన బ్యాక్టీరియా ఉంటే, అవి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.

అలా బెలూన్లు మాత్రమే కాదండోయ్, పెన్, మొబైల్, కీ, వైర్, బాటిల్ క్యాప్ వంటి వాటిపై హానికరమైన బ్యాక్టీరియా పేరుకుపోయే అనేక వస్తువులను మనం నోటిలో పెట్టుకుంటాం.

రోజూ నీళ్లతో కడుక్కోనందున బ్యాక్టీరియా వాటిపై నివాసం ఉంటుందని గుర్తు పెట్టుకుంటే మంచిది.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ?