ఇకపై స్మార్ట్ వాచ్ నుండే చాట్‌జీపీటీని వాడుకోవచ్చు తెలుసా?

కొత్తగా ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇప్పటికే పెను సంచలనాలు సృష్టిస్తున్న సంగతి విదితమే.

సింపుల్ మరియు లాజికల్ ఆన్సర్లు ఇస్తూ ఈ ఏఐ చాట్‌బాట్ యూజర్లని ఆశ్చర్య పరుస్తోంది.

దాంతో ఈ మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ చాట్‌బాట్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది.ఈ నేపథ్యంలో దీనిని టెక్ దిగ్గజాలు దీనిని అందరి యూజర్లకు అందుబాటులోకి తేవడం మొదలుపెట్టాయి.

ఈ ఇంటిగ్రేషన్‌లో భాగంగా తాజాగా ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ తన యూజర్లకు కొత్త అప్‌డేట్‌ ద్వారా చాట్ జీపీటీని అందజేసింది.

"""/" / అవును, మీరు విన్నది నిజమే.యూజర్లు ఇపుడు తమ అమేజ్‌ఫిట్ (Amazfit) స్మార్ట్‌వాచ్‌లో ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఏఐ చాట్‌జీపీటీ (AI ChatGPT) సేవలను పొందొచ్చు.

అమేజ్‌ఫిట్ మాతృ సంస్థ అయినటువంటి జీప్ హెల్త్ దాని వేరబుల్స్ కోసం Zepp OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ ఓఎస్ న్యూ అప్‌డేట్‌లోనే పాపులర్ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను అమేజ్‌ఫిట్ ఇంటిగ్రేట్ చేసినట్టుగా పేర్కొంటున్నారు.

స్మార్ట్‌వాచ్‌లో ఏఐ చాట్‌జీపీటీని అందించడానికి, అమేజ్‌ఫిట్ ప్రత్యేక డయల్ లేదా వాచ్ ఫేస్ రూపంలో ఒక టూల్‌ను అభివృద్ధి చేసింది.

తద్వారా మీరు మీ స్మార్ట్‌వాచ్‌ ద్వారానే చాట్‌జీపీటీని ప్రశ్నలు అడగవచ్చు. """/" / ఇకపోతే, మీరు అడిగే ఏ ప్రశ్నకైనా చాట్‌జీపీటీ మీకు మల్టిపుల్ డేటాను ఇస్తుందని అమేజ్‌ఫిట్ చెబుతోంది.

దాంతో స్మార్ట్‌వాచ్‌లో చాట్‌జీపీటీని అందించిన తొలి సంస్థగా అమేజ్‌ఫిట్ అవతరించబోతోంది.ఎందుకంటే శామ్‌సంగ్ లేదా గూగుల్ వంటి ప్రీమియం బ్రాండ్స్‌ కూడా ఇప్పటివరకు ఈ సౌకర్యాన్ని తీసుకురాకపోవడం గమనార్హం.

అమేజ్‌ఫిట్ వాటితో పోలిస్తే చిన్న కంపెనీ.అయినప్పటికీ చాట్‌జీపీటీని స్మార్ట్‌వాచ్ ఎకో సిస్టమ్‌కు తీసుకురాగలిగింది.

ఇకపోతే అమేజ్‌ఫిట్ క్వాలిటీ వేరబుల్ డివైజ్‌లు తయారు చేస్తుంది.అలాగే కొత్త టెక్నాలజీలను కూడా ఆఫర్ చేస్తుంటుంది.

అలాంటి బయోపిక్ సినిమాలో నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన నాని!