వేద దేవతలకు రూపాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా?
TeluguStop.com
మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు వేదాలు, పురాణాలు చాలానే ఉన్నాయి.అందులో భాగంగానే నాలుగు వేదాల గురించి మన పూర్వీకులు వివరించారు.
అయితే ఈ నాలుగు వేదాలే దేవతలుగా కూడా అవతరించారు.ఆ విషయం చాలా మందికి తెలియదు.
అయితే ఇప్పుడు వేద దేవతలు వారి రూపాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో ప్రతి అంశానికి అదిష్ఠాన దేహాలు ఉంటాయి.నదులు, పర్వతాల వంటి వాటికి దివ్య దేహాల దేవతా రూపాలు ఉన్నాయి.
అదే విధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలకూ దేవతా రూపాలు ఉన్నాయి.
ఆయా వేదాల్లో ఉండే లక్షణాలు ఆరు మూర్తుల్లో కనిపిస్తున్నాయి.ఋగ్వేద దేవత తెల్లని రంగులో రెండు చేతులతో ఉంటుంది.
గాడిద ముఖం కలది అక్షర మాల ధరించి.సౌమ్య ముఖంతో ప్రీతిని ప్రకటించే వ్యాఖ్యానం చేసే ప్రయత్నంలో ఉంది.
యజుర్వేద దేవత మేక ముఖంతో పచ్చని రంగుతో.జప మాలను ధరించి ఎడమ చేతిలో వజ్రా యుధం పట్టుకొని ఉంటుంది.
ఐశ్వర్యాన్ని శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది.సామ వేద దేవత గుర్రం ముఖంతో నీలి శరీరంతో ఉంటుంది.
కుడి చేతిలో అక్షర మాల, ఎడమ చేతిలో పూర్ణ కుంభాన్ని పట్టుకొని ఉంటుంది.
అధర్వణ వేద దేవత కోతి ముఖంతో తెల్లని రంగుతో ఉంటుంది.ఎడమ చేతిలో జప మాల, కుడి చేతిలో పూర్ణ కుంభాన్ని పట్టుకొని ఉంటుంది.
ఇలా ఉండే వేద దేవతల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఆ విషయం నాకు మాత్రమే తెలుసు… శోభిత పెళ్లి ఫోటోలపై సమంత కామెంట్స్!