నోట్లో క‌నిపించే ఈ ల‌క్ష‌ణాలు డ‌యాబెటిస్‌కి సంకేత‌మ‌ని మీకు తెలుసా?

డ‌యాబెటిస్ లేదా మ‌ధుమేహం.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.ముఖ్యంగా చిన్న వ‌య‌సు వారు సైతం డ‌యాబెటిస్ బారిన ప‌డుతుండ‌డం భారీగా పెరిగిపోతోంది.

గంటల తరబడి కూర్చోని ఉండటం, శారీరక శ్రమ లేక పోవ‌డం, పోష‌కాల కొర‌త‌, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవ‌డం, తీపి పదార్థాలు ప‌రిమితికి మించి తీసుకోవ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఊబ‌కాయం, జీవ‌న శైలిలో మార్పులు ఇలా ర‌క‌ ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ధుమేహం బారిన ప‌డుతున్నారు.

అలాగే కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా డ‌యాబెటిస్ వ‌స్తుంది.కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ మ‌ధుమేహం వ్యాధిని స్టార్టింగ్ ద‌శ‌లో గుర్తించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.

దానిని సంపూర్ణంగా నివారించుకోవ‌చ్చు.అయితే షుగర్‌ వ్యాధిని నోట్లో కనిపించే కొన్ని లక్షణాల బ‌ట్టీ కూడా తొలినాళ్లలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆ ల‌క్ష‌ణాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.నోరు తడారిపోవ‌డం మ‌ధుమేహానికి సంకేతంగా చెప్పుకోవ‌చ్చు.

అవును, మ‌ధుమేహం వ్యాధి ఏర్ప‌డిన‌ప్పుడు శ‌రీరం డీహైడ్రేట్ అయిపోతుంది. """/"/ అందు వ‌ల్ల‌నే ఎంత నీరు తీసుకున్నా త‌ర‌చూ నోరు త‌డారి పోవ‌డం, అధిక దాహం వంటి ల‌క్ష‌ణాలు అధికంగా క‌నిపిస్తారు.

అలాగే చిగుళ్ల నుంచి రక్తం రావ‌డం కూడా డయాబెటిస్‌ మొదటి దశలో క‌నిపించే లక్షణంగా చెప్పుకోవ‌చ్చు.

అంతే కాదు.నాలుకపై తెల్లని పూతలా ఏర్ప‌డం, నోట్లో త‌ర‌చూ పుండ్లు ఏర్ప‌డ‌టం, దంత క్షయం, చిగుళ్ల వాపులు, ఆహారం నమలడం మ‌రియు మింగడంలో ఇబ్బందులు వంటి కూడా మ‌ధుమేహం తొలి నాళ్ల‌లో క‌నిపించే ల‌క్ష‌ణాలు.

కాబ‌ట్టి, ఇలాంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ మీకు ఎదురైతే ఖ‌చ్ఛితంగా వైద్యుల‌ను సంప్ర‌దించి షుగ‌ర్ టెస్ట్‌లు చేయించుకుని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

దేవర నిర్మాతల కంటే ఆయనకే ఎక్కువ లాభాలను అందించిందా.. ఏమైందంటే?