‘టీచర్స్’ విస్కీ వెనుక ఇంత మ్యాటర్ ఉందని తెలుసా?

నిజానికి అందరికీ తెలుసు ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి చాలా హాని కరమని.కానీ మద్యం తాగే వారి సంఖ్య మాత్రం రోజురోజుకీ మరింత పెరుగుతుందే తప్పించి తగ్గడం లేదు.

కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మద్యానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.

విస్కీ, రమ్, బీర్( Whiskey, Rum, Beer ).ఇలా పేరు ఏదైనా ఆల్కహాల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇందులో చాలామంది 'టీచర్స్' విస్కీనే ఇష్టపడుతూ ఉంటారు.ఇక సిటీలలో నివసించేవారు ఎక్కువగా విస్కీలో టీచర్స్ విస్కీ అనే పేరుతో ఉన్న విస్కీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

అయితే వాస్తవానికి ఆ టీచర్స్ విస్కీకి ఆ పేరు ఎలా వచ్చిందో బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందామా.

"""/" / వాస్తవానికి ఈ విస్కీకి 175 సంవత్సరల గల చరిత్ర ఉండడం విశేషం.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.స్కాట్లాండ్ ( Scotland )లోని ఒక యువకుడు 1830 లో ఈ విస్కీని స్వయంగా తయారు చేసినట్లు తెలుస్తుంది.

ఆ విస్కీని తన కోసమే తయారు చేసుకున్నాడని.ఆ రుచి అతడి స్నేహితులు, బంధువులకు కూడా బాగా నచ్చిందని దీంతో అతడు ఆ విస్కీని విక్రయించడం మొదలుపెట్టాడని సమాచారం.

1860లో స్పిరిట్స్ ( Spirits )చట్టం కింద నమోదులో భాగంగా టీచర్స్ పేరుతో బ్రాండ్‌గా మారిపోయింది.

ఆ విస్కీని తయారు చేసిన ఆ యువకుడి పేరు విలియం టీచర్స్. """/" / అతడి పేరునే కాస్త ఆ బ్రాండ్ ప్రారంభమై భారతదేశంలో ఒక మంచి పేరును సొంతం చేసుకుంది.

ఇక విలియం టీచర్స్( William Teachers ) మరణించిన అనంతరం అతని కుమారులు తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

అంతేకాకుండా ఆ కంపెనీ పేరును ` విలియం టీచర్ అండ్ సన్స్ లిమిటెడ్ ` గా పేరు మార్చారు.

ప్రస్తుతం టీచర్స్ విస్కీ భారత దేశంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రజలకు లభించడంతో ఒక మంచి బ్రాండ్ గా గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈ టీచర్స్ విస్కీ ఫుల్ బాటిల్ ధర విషయానికి వస్తే భారత్ లో రూ.

1700 నుంచి రూ.2000 మధ్య ఉంటుంది.

చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీలోనే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!