ఓ వారం రోజులపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్‌ లేదు తెలుసా?

రెండు రోజులకు ముందే దీపావళి పండగ వాతావరణం మొదలయ్యింది.ఎక్కడ షాపింగ్ మాల్స్ చూసినా అత్యధిక డిస్కౌంట్స్ తో కస్టమర్లని ఊరిస్తున్నాయి.

మరోవైపు ఆన్లైన్ మార్కెట్లో మొబైల్స్, బట్టలు, వివిధ రకాల హోమ్ నీడ్స్ వాటిమీద 50% పైనే డిస్కౌంట్స్ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఓ వారం రోజుల పాటు ట్రాఫిక్‌ రూల్స్‌ ఎత్తేసారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.

పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్‌ విధించబోమని ప్రకటించింది గుజరాత్‌ ప్రభుత్వం.

ఎప్పటినుండి ఇది మొదలవ్వనుందంటే, అక్టోబర్‌ 21 నుంచి 27 తేదీల మధ్య ఈ నిర్ణయం అమలులోకి రాబోతుందని హోం శాఖ మంత్రి అయినటువంటి హర్ష్‌ సంఘవీ ప్రకటించారు.

అతను తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ."దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త.

మీరు ఓ వారం రోజుల పాటు ఎలాంటి చలానాలు పోలీసులు విధించారు.అయితే అలాగని ఈ నిర్ణయంతో రూల్స్‌ను అతిక్రమించాలని మాత్రం చూడకండి.

రూల్స్‌ బ్రేక్‌ చేస్తే మాత్రం పోలీసులు చూస్తూ ఊరుకోరు." అని అన్నారు.

"""/"/ ఇంకా ఆయన మాట్లాడుతూ.చనువు ఇచ్చం కదాని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, గుజరాత్ పోలీసులు వెంటనే పూలు ఇచ్చి వారికి ఓ నివాళిలాగా శిక్షిస్తారు అని అన్నారు.

అంతేకాకుండా దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతోందని కూడా ఈ సందర్భంగా హర్ష్‌ సంఘవీ తెలిపారు.

ఇకపోతే గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండే అవకాశాలు మెండుగా వున్నాయి.

దాని వల్లనేమోగాని, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు నో జరిమానా నిర్ణయంపై నెట్టింట్లో మిశ్రమ స్పందన వస్తోంది.

అందులో అధిక వర్గం ఇది ఎన్నికలకోసం చేస్తున్న పబ్లిసిటీ అని కొట్టి పారేస్తున్నారు.

బైక్ రైడర్లపై దాడి చేసిన ఎద్దు.. వీడియో చూస్తే గుండె గుబేల్..?