హైబీపీ ఉన్నవారు జున్ను తిన‌కూడ‌ద‌ని మీకు తెలుసా?

జున్ను(చీజ్‌).పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఇష్టంగా తినే ఆహారాల్లో ఇది ఒక‌టి.

య‌మ్మీ య‌మ్మీగా టేస్ట్‌ను క‌లిగి ఉంటే జున్నులో ఎన్నో పోష‌క విలువ‌లు క‌లిగి ఉంటాయి.

అందుకే జున్ను ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌గ‌ల‌దు.ముఖ్యంగా ఎముక‌ల‌ను దృఢ‌ప‌ర‌చ‌డంలోనూ, కంటి చూపును పెంచ‌డంలోనూ, ప్రోటీన్ కొర‌త ఏర్ప‌కుండా చేయ‌డంలోనూ, ర‌క్త హీన‌త‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, జీవక్రియను వేగ వంతంగా మార్చ‌డంలోనూ జున్ను అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

"""/" / అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం జున్నుకు దూరంగా ఉండాల్సిందే.

ఈ లిస్ట్‌లో హైబీపీ( అధిక ర‌క్త పోటు) బాధితులు ముందు వ‌ర‌స‌లో ఉంటారు.

అవును, హైబీపీతో త‌ర‌చూ బాధ ప‌డే వారు జున్నును కాస్త ఎవైడ్ చేయాల్సిందే.

ఎందు కంటే, జున్నులో సోడియం కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.అందు వల్ల‌, హైబీపీ ఉన్న వారు జున్నును తీసుకుంటే ర‌క్త పోటు స్థాయిలు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.

జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం, తుమ్ములు వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు జున్నును తింటే.

ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్ర త‌రంగా మారిపోతాయి.అందుకే అలాంటి వారు జున్నును తిన‌క పోవ‌డ‌మే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి మ‌రియు ఇత‌ర వాత నొప్పులు ఉన్న వారు సైతం జున్నుకు దూరంగా ఉండాలి.

లేదంటే నొప్పులు ఎక్కువై నానా ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. """/" / ఇక కొంద‌రు ఆరోగ్యానికి మంచిద‌ని చెప్పి జున్నును తెగ లాగించేస్తారు.

హెల్త్‌కి జున్ను మంచిదే.అందులో ఎటువంటి సందేహ‌మూ లేదు.

అలా అని జున్నును ప‌రిమితికి మంచి తీసుకుంటే క‌డుపు నొప్పి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, వికారం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌.

పెనమలూరు అసెంబ్లీని గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తాం – బోడె ప్రసాద్