యాదర్షి మహర్షికి దర్శనమిచ్చిన నరసింహస్వామి రూపాలు ఇవే!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.ఈ కొండపై యాదర్షి అనే మహర్షి తపస్సు చేయటంవల్ల స్వామివారి ప్రత్యక్షమై అక్కడే కొలువై ఉన్నారని చెబుతారు.

అందువల్ల ఇక్కడ ఉన్న స్వామి వారిని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు.

ఈ కొండపై యాదగిరి నరసింహ స్వామి మూడు రూపాల్లో దర్శనం భాగ్యం కలిగిందని చెబుతారు.

అయితే ఆ నరసింహ స్వామి మూడు రూపాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.చిన్న నాటి నుంచి ఆ నరసింహ స్వామి భక్తుడైన యాదర్షి ఎలాగైనా స్వామివారిని చూడాలని ఘోరమైన తపస్సు చేస్తాడు.

కానీ ఎప్పుడు స్వామివారి అనుగ్రహం కలగలేదు.స్వామివారి అనుగ్రహం కోసం అడవులు కొండలు తిరుగుతున్న ఒకరోజు యాదగిరి అరణ్యంలో ఒక చెట్టు కింద సేదతీరుతూ ఉంటాడు.

అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి నీకు తోడుగా నేను ఉంటాను కఠినమైన తపస్సు చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెబుతాడు.

వెంటనే మెలుకువలోకి వచ్చిన యాదర్షి అక్కడే తపస్సు చేస్తాడు. """/" / యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహ స్వామి ప్రత్యక్షమవుతాడు.

యాదర్షి నరసింహ స్వామి ఉగ్రరూపం చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడు.అప్పుడు లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా, నీ అనుగ్రహం కోసం సామాన్యులు ఇంత ఘోర తపస్సు చేయలేరు, కాబట్టి మీరు శాంత స్వరూపంతో ఇక్కడే కొలువై ఉండాలని స్వామి వారిని అడుగుతారు.

అప్పుడు కొండలపై నరసింహస్వామి అవతరించాడు.కొన్ని రోజుల తర్వాత స్వామి వారిని కేవలం ఒక రూపంలో మాత్రమే చూశాను వివిధ రూపాలలో చూడలేకపోయానని అనుమానం రావడంతో తిరిగి కొండపై చేరుకొని తపస్సు మొదలు పెడతాడు.

కొన్ని రోజులకు స్వామివారి ప్రత్యక్షమవగానే అప్పుడు యాదర్షి స్వామి వారి రూపాలను చూడాలని అడుగగా నా అన్ని రూపాలని నువ్వు చూడలేవు, నీ కోసం మూడు రూపాలు చూపిస్తానని జ్వాల, యోగానంద, గండభేరుండ అని మూడు రూపాలలో దర్శనం కల్పిస్తాడు.

జ్వాలా నరసింహుడు సర్ప రూపంలో, యోగానంద నరసింహుడు అర్చా విగ్రహరూపంలో, గండభేరుండ కొండ బిలంలో ఉంటారు.

తరువాత యాదర్షి తనను స్వామివారిలో ఐక్యం చేసుకోమని అడుగగా, స్వామివారు తనలో ఐక్యం చేసుకోవడం వల్ల యాదర్షి పేరుమీద గానే అక్కడ యాదగిరిగుట్టగా అవతరించిందని చెబుతుంటారు.

ఈ నెల 31న భారత్‎కు ప్రజ్వల్ రేవణ్ణ..!!