Subhasini : ఈ అరుంధతి విలన్ కూతురు హీరోయిన్ అని మీకు తెలుసా.. ఏ సినిమాలో నటించిందంటే?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు ఎంట్రీ ఇవ్వడం అన్నది సర్వసాధారణం.ఇప్పటికే అలా ఎంతోమంది సెలబ్రిటీల వారసులు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్ లుగా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ కూడా సెలబ్రిటీల కు సంబంధించిన వారసులు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.
ఇకపోతే తెలుగు ప్రేక్షకులకు జయసుధ( Jayasudha ) సోదరి నటి సుభాషిణి( Subhasini ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సుభాషిణి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ అరుంధతి సినిమాలో జలజ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఆ సినిమాలో పశుపతికి తల్లిగా నటించి భారీగా పాపులారిటీని సంపాదించుకుంది సుభాషిణి.అలాగే సీతయ్య సినిమాతో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.
"""/" /
అప్పట్లో ఈమె ఎన్టీఆర్, నాగేశ్వరరావు, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ నటీనటుల సినిమాల్లో నటించి మెప్పించింది.
అలాగే సినిమాల్లో హీరోయిన్‌గా కూడా రాణించింది.అదేవిధంగా తన అక్క జయసుధతో కూడా పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.సినిమాలలో నటిస్తున్న సమయంలోనే తన బావను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలలో నటించింది.
సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఆమెకు ఎక్కువగా విలన్ పాత్రలే రావడంతో ఆమె సినిమాలకు దూరం అయ్యింది.
అలా ఇప్పటివరకు ఆమె తెలుగు,తమిళం,మలయాళం కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలలో అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించింది.
"""/" /
తన కూతురిని కూడా సినిమాలోకి తీసుకువచ్చింది సుభాషిణి.కుమార్తె పేరు పూజ( Pooja ).
ఆమె పూరీ జగన్నాథ్ సినిమా 143లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.పూరీ జగన్నాథ్ తమ్మడు సాయి రామ్ శంకర్ హీరో, సమీక్ష హీరోయిన్.
ఆ సినిమాలో హీరో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపిస్తుంది.అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో మళ్లీ పూజ ఏ సినిమాలోనూ కనిపించలేదు.
2012లో పూజ ప్రియాంకకు ఆకెళ్ల చంద్ర శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్23, సోమవారం2024