Hema: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హేమ నటి శ్రీదేవికి డూప్ గా నటించారని తెలుసా.. ఏ సినిమా అంటే?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించే నటీనటుల అందరికీ కూడా వారి డూప్స్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
అన్ని సన్నివేశాలలో హీరో హీరోయిన్స్ నటించడానికి ఏమాత్రం ఇష్టపడరు.కొన్ని కష్టతరమైనటువంటి సన్నివేశాలలో వారికి బదులు అచ్చం వారి పోలికలతో ఉన్నటువంటి వారిని నటింపచేస్తూ ఉంటారు.
ముఖ్యంగా హీరోలకు ఇలాంటి డూప్స్ ఎక్కువగా ఉంటారు ఏదైనా యాక్షన్స్ సన్ని వేశాలలో నటించడానికి హీరోలు ముందుకు రాకపోవడంతో వారి డూప్స్ సహాయంతో సినిమా షూటింగ్ పూర్తి చేస్తుంటారు.
ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకు డూప్స్ ఉంటారు.ఈ క్రమంలోనే చలనచిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి ( Sridevi )ఒకరు.
ఈమె తెలుగు భాష మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు భోజ్పురి సినిమాలలో కూడా నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
;ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరు సరసన నటించినటువంటి శ్రీదేవి అకాల మరణం అందరిని ఎంతగానో కృంగదీసింది.
ఇక ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని కూడా చెప్పాలి.ఈ విధంగా శ్రీదేవి( Sridevi ) మరణం తర్వాత ఆమె కుమార్తె తన వారసురాలుగా ఇండస్ట్రీలోకి పరిచయమై ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటనపరంగా ఎలాంటి సన్నివేశాన్ని అయినా చాలా చాలెంజ్గా తీసుకొని నటించే శ్రీదేవి కూడా కొన్ని సన్నివేశాలలో తన డూపు సహాయంతోనే నటించే వారట.
ఇక తెలుగులో చిరంజీవి హీరోగా నటించినటువంటి జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి హేమ నటించారని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి పాత్రలో నటి హేమ నటించారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు అసలు ఏ సన్నీ వేషంలో శ్రీదేవికి బదులు హేమ నటించారు.
అలా నటించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవకన్య పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈమెను చూస్తే నిజంగానే దేవకన్య భూలోకానికి దిగి వచ్చిందా అన్న సందేహం రాక మానదు అంతా అద్భుతంగా ఈ సినిమాలో నటించారు.
అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నీళ్లలో దిగి ఈదే సన్నివేశంలో నటించాల్సి వచ్చిందట అయితే ఈమెకు ఈత రాకపోవడంతో ఈ సన్నివేశంలో తాను నటించనని నిర్మొహమాటంగా చెప్పేశారు.
"""/" /
ఇలా తనకు ఈత రాకపోవడంతో నీళ్లలో దిగి తాను నటించలేనని శ్రీదేవి చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితులలో ఈమె పోలికలకు దగ్గరగా ఉన్నటువంటి నటి హేమ ( Hema )సన్నివేశంలో నటించి ఆ షాట్ పూర్తి చేశారు.
ఈ విధంగా నటించాల్సిన ఒక పాత్రలో నటి హేమ నటించారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక నటి హేమ ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు ఈమె పలు సినిమాలలో అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు కూడా కాస్త తగ్గాయని తెలుస్తుంది.
వైరల్ వీడియో: ఆ కుక్కను ముద్దు చేశాడని.. వాచ్‌మెన్‌పై అసూయతో దాడిచేసిన మరో కుక్క!