Red Eyes : ఫోటో లో మీ కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయా..? అయితే ఇది దేనికి సంకేతమో తెలుసా..?
TeluguStop.com
ప్రస్తుతం ప్రతి సందర్భాన్ని ఫోటోలో క్యాప్చర్ చేయడం అలవాటుగా మారిపోయింది.అలాగే చాలామంది ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇప్పటివరకు అందరూ ఫోటోలో అందం కనిపిస్తుందని అనుకుంటారు.కానీ ఫోటోలు ఆరోగ్యాన్ని కూడా చూపిస్తాయి.
సాధారణంగా ఫోటోల్లో కొందరి కళ్ళు ఎర్రగా( Red Eyes ) కనిపిస్తాయి.ఎరుపు అనేది ఫోటో స్టైలిష్ లుక్ కు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ శరీరం చక్కగా పని చేస్తుందనడానికి సూచిక.
కళ్ల ఎరుపు అనేది బయటకు కనిపించకపోవచ్చు.కేవలం ఫోటోలో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది.
అంటే కెమెరాలు కళ్ల వెనక జరుగుతున్న విషయాలను బహిర్గతం చేస్తాయి. """/" /
కంటిలో ఎరుపు ప్రభావం అనేది కెమెరా ఫ్లాష్( Camera Flash ) వలన ఏర్పడుతుంది.
ఫ్లాష్ అనేది కంటి లోపల భాగాన్ని ఎన్లైట్ చేసి అక్కడ ఎర్ర రక్త కణాలను( Red Blood Cells ) ఫోటోలో ప్రతిబింబించేలా చేస్తుంది.
కెమెరాలో చూసినప్పుడు ఎరుపునీ రిఫ్లెక్స్ జరుగుతుంది.అప్పుడు కళ్ళు నేరుగా కెమెరా లెన్స్ వైపు చూస్తుంటే రెండు కళ్ళలో రిఫ్లెక్స్ కలర్ రెడ్ గా ఉంటే సాధారణంగా రెండు కలర్ రెటినాలో అడ్డంకులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయని సంకేతం.
ఇక తీసిన ప్రతి ఫోటోలో కన్ను ఎర్రగా కనిపించకపోయినా కూడా వాటికి కొన్ని కారణాలు ఉంటాయి.
ఫోటో తీయడానికి ముందే రెప్ప వేయడం లేదా కెమెరాలోకి నేరుగా చూడకుండా ఉండడం దానికి కారణం అవ్వచ్చు.
"""/" /
ఏదైనా సమస్య ఉందడానికి సూచిక కూడా కావచ్చు.ఎర్రగా లేకపోవడంతో స్ట్రాబిస్మస్ లాంటి కొన్ని సాధారణ సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తి కళ్ళు వేరువేరు దిశల్లో చూపుతున్నప్పుడు దీన్ని గుర్తించవచ్చు.దీన్ని స్క్వింట్ ( Squint Eyes ) అని కూడా అంటారు.
ఇది చిన్నపిల్లల్లో సాధారణమైన చిన్న సమస్య.దీన్ని సరిదిద్దవచ్చు కూడా.
అయితే ఒక కన్ను మాత్రమే ఎందుకు ఎర్రగా ఉందో తెలుసుకోవచ్చు.కంటి ఎరుపు అనేది రెటినోబ్లాస్టోమా లక్షణం కూడా కావచ్చు.
ఇది చిన్ననాటి క్యాన్సర్ అరుదైన రకం.తమ పిల్లల కళ్ళు వింతగా కనిపించడానికి గమనిస్తే వెంటనే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి.
ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!