ప్లీజ్ నన్ను అందులోకి మార్చేయండి.. మొండి చేసి విజయం సాధించిన మంచు లక్ష్మి?
TeluguStop.com
టాలీవుడ్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి, పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది.
అయితే మంచు లక్ష్మి యు.ఎస్ లో చదువుకుంది అన్న విషయం చాలా మందికి తెలియదు.
డిగ్రీ కోసం అమెరికా వెళ్లినప్పుడు అందరు దక్షిణాది అమ్మాయిల్లాగే మంచు లక్ష్మి కూడా ఒక్లహామా సిటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరారు.
ఆమెకు క్లాస్‌లో కూర్చుంటే నిద్ర వచ్చేసేది.ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు.
ఇక మాథ్స్ అయితే అస్సలు తలకి ఎక్కేది కాదు.ఫస్ట్ సెమిస్టర్‌లో ఉండగానే ఒకసారి కాలేజీలో ఏదో నాటకం వేస్తుంటే వెళ్లారు.
అక్కడి స్టేజ్ తనను పిలుస్తున్నట్లే అనిపించింది.తాను ఏమి కోల్పోయిందో ఆ క్షణంలోనే అర్థమైంది.
మరుసటి రోజు తన కౌన్సిలర్ దగ్గరకు వెళ్లి నన్ను థియేటర్ ఆర్ట్స్‌లోకి మార్చేయండి అని లక్ష్మి అడిగిందట.
ఆమె పిచ్చా,వెర్రా అని తిట్టిందట.అది కంప్లీట్‌గా ఇంగ్లీష్ ఓరియంటెడ్ థియేటర్.
షేక్‌స్పియర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చేసిన నాటకాలన్నీ నేర్చుకోవాలి.పైగా ఇక్కడ నువ్వొక్కదానివే ఇండియన్ స్టూడెంట్‌వి.
చాలా కష్టం అని చెప్పిన లక్ష్మి వినలేదుట.థియేటర్ ఆర్ట్స్‌కి మారింది.
"""/"/
ఆ తరువాత కాలేజీలో వేసే ప్రతి ఒక్క నాటకంలోనూ ఆమె పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది.
సినిమాల కంటే ముందు అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లలో నటించింది.మొదటగా 2004లోనే లాస్ వేగాస్ సిరీస్‌లో ఆమె నటించిన సరస్వతి అనే క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
తెలుగులో నటించిన తొలి సినిమా అనగనగా ఓ ధీరుడులో చేసిన ఐరేంద్రి క్యారెక్టర్‌తోటే ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు.
తెలుగులో నటించడానికంటే ముందు 'ది ఓడ్', 'డెడ్ ఎయిర్' అనే ఇంగ్లీష్ సినిమాలలో ఆమె నటించింది.