కేవలం లవంగాలతో చుండ్రును పోగొట్టుకోవచ్చు.. తెలుసా?

లవంగాలు(cloves).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

బిర్యానీ, నాన్ వెజ్ వంటల్లో ల‌వంగాల‌ను విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ఘాటైన రుచి కలిగి ఉండే లవంగాలు వంటలకు చక్కటి ఫ్లేవ‌ర్ ను అందిస్తాయి.

అయితే చాలా మంది లవంగాలను కేవలం మసాలా దినుసుగా మాత్రమే చూస్తారు.కానీ లవంగాల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే జుట్టు సంరక్షణకు కూడా లవంగాలు ఉపయోగపడతాయి.

ముఖ్యంగా చుండ్రు సమస్యను(dandruff) వదిలించడానికి లవంగాలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం లవంగాలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రును పోగొట్టుకునేందుకు లవంగాలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

"""/" / వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ లవంగాల వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను (Shampoo)మిక్స్ చేయాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా లవంగాలను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకుంటే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

అంతేకాదు, చుండ్రు మళ్ళీ మళ్ళీ వేధించకుండా సైతం ఉంటుంది.పైగా లవంగాలను ఉపయోగించి పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

మరియు జుట్టు త్వరగా తెల్ల బ‌డ‌కుండా సైతం ఉంటుంది.కాబ‌ట్టి, చుండ్రుతో బాధ‌ప‌డుతున్న వారు ల‌వంగాల‌తో పైన చెప్పిన విధంగా వ‌దిలించుకోండి.

నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!