రెండేళ్ల పాటు ఒకే డ్రస్సు వేసుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

150కి పైగా సినిమాలు.40ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం.

నాలుగు శతాబ్ధాల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు.మరెన్నో రికార్డ్ లు.

అంతకు మించి స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు.

అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన విశ్వవిజేత ఆయనే మెగస్టార్ చిరంజీవి.

కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

చెన్నై లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనలో డిప్లొమా చేసిన తరువాత 1978లో పునాది రాళ్లు సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మొదటిసారి నిర్మాత జయకృష్ణ చిరంజీవికి ఇచ్చిన పారితోషికం 1,116 రూపాయలు.అలా ప్రారంభమైన మెగస్టార్ చర్మిష్మా నాలుగు శతాబ్ధాల నుంచి హీరోలకు పోటీగా 150కి పైగా సినిమాలు చేశారు.

వాటిలో 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ సినిమా అంజి.

కమర్షియల్ వరుసహిట్లతో జోరుమీదున్న చిరంజీవితో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1997లో అంజి సినిమాతో టాలీవుడ్ కు గ్రాఫిక్స్ ను పరిచయం చేశారు.

మంచి గ్రాఫిక్స్ సినిమా తీయాలనేది ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ కలతోనే చిరంజీవి హీరోగా 1997లో అంజి షూటింగ్ ను ప్రారంభించారు.

అలా ప్రారంభమైన ఈ సినిమా 2004లో విడుదలైంది.ఈ సినిమాకు చిరంజీవి పడిన కష్టం అంతా ఇంతా కాదు.

పైగా గ్రాఫిక్స్ సినిమా.ఓ షాట్ 100 నుంచి 120షాట్లు తీయాల్సి వచ్చేంది.

ఇక గ్రాఫిక్స్ పరంగా చిరంజీవి ధరించిన క్యాస్టూమ్ సినిమాకు పెద్ద ఎస్సెట్.ఈ సినిమాలో గ్రాఫిక్స్ షాట్లకు ఉపయోగించే ఒకే క్యాస్టూమ్స్ ను చిరంజీవి సంవత్సరంపాటు ధరించారు.

క్యాస్టూమ్స్ ను ఉతికితే చెడిపోతాయని.వాటిని ఉతకనివ్వకుండా సంవత్సరం పాటు ధరించారు.

గ్రాఫిక్స్ కోసం షాట్ల ఎడిటింగ్ కోసం సింగపూర్, అమెరికా, మలేషియా తరలించేవారు.ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈషూటింగ్ జరిగింది.

విడుదల తరువాత అంజి సినిమా అద్భుతమైన కళా ఖండంగా చిరంజీవి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?