అప్పట్లో హీరోయిన్ స్నేహకు, నయనతారకు బాలయ్య నోటీసులు పంపారని మీకు తెలుసా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు తమ వ్యక్తిగత విషయాల వల్ల సినిమాకు బ్యాన్ అవుతుంటారు.

దానివల్ల సినిమాలలో అవకాశాలు కూడా వారి దరికి రావు.ఎందుకంటే తాము తమ వ్యక్తిగత విషయాల పట్ల ప్రవర్తించే తీరు అలా ఉంటుందన్నమాట.

ఇప్పటికే చాలామంది నటీనటులు దర్శక నిర్మాతలతో, స్టార్ నటీనటులతో ప్రవర్తించే తీరు విధానంలో కొన్ని మార్పులు ఉండటం వల్ల సినిమా నుండి బ్యాన్ చేయబడ్డారు.

అలాగే గతంలో స్నేహ, నయనతారకు కూడా ఇటువంటి సంఘటన ఎదురైంది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో నయనతార, స్నేహ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నయనతార కంటే ముందు స్నేహ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఈమె చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తుంది.

ఇక నయనతార కూడా స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలో ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే గతంలో వీరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో వీరికి స్టార్ హీరో నందమూరి బాలయ్య నోటీసులు పంపారు.

"""/" / చాలా వరకు ఈ విషయం ఎవరికి తెలియక పోగా.అసలేం జరిగిందో తెలుసుకుందాం.

గతంలో వరదబాధితుల సహాయార్థం కోసం బాలకృష్ణ ఈవెంట్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాడు.

అది కూడా స్టార్ నైట్ అనే కార్యక్రమమును చేపట్టాడు.ఇక ఈ 'స్పందన' అనే ఈ స్టార్ నైట్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఇతర ప్రముఖులకు నోటీసులు పంపాడు.

అయితే ఈ నోటీసులు పంపే ముందు ప్రతి ఒక్కరిని ఈ విషయం గురించి సరైన వివరణ ఇవ్వాలి అని తెలిపాడు.

ఒకవేళ ఎటువంటి వివరణ ఇవ్వకపోతే తెలుగు సినిమాలలో బ్యాన్ అవుతారని డిమాండ్ చేశాడు.

అయినా కూడా ఈ కార్యక్రమం కు స్నేహ, నయనతార అటెండ్ కాలేదు. """/" / ఈ కార్యక్రమం కు త్రిష కూడా హాజరు కాకపోవడంతో తాను ముందే హాజరుకానని తెలిపిందట.

కానీ స్నేహ, నయనతార ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ రోజు జరిగిన సమావేశంలో ఈవెంట్ హానరరీ ఛైర్మన్ డాక్టర్ దాసరి నారాయణరావు ఎవరైతే ఈవెంట్ కు దూరంగా ఉంటారో వాళ్లపై నిషేధం జరుగుతుందని తెలిపాడు.

"""/" / దీంతో నయనతార, స్నేహ లపై కూడా నిషేధం జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

కానీ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరిపై నిషేధాన్ని రద్దు చేశారని ఇటువంటి తప్పులు మళ్లీ మరోసారి చేయకూడదు అని గట్టిగా తెలిపారట.

ఆ తర్వాత తమ తమ సినిమాలలో యధావిధిగా నటించమని నోటీసులు ఇచ్చారని తెలిసింది.

ఏందయ్యా ఇది.. ఫ్రైడ్ రైస్‌తో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి..