ఈ డైరెక్టర్ తమ్ముడు స్టార్ హీరో అని మీకు తెలుసా..?
TeluguStop.com
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో "7/జి బృందావన్ కాలనీ" అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ దర్శకుడు "సెల్వ రాఘవన్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే సెల్వ రాఘవన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు లవ్ ఓరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకోవడంలో మంచి దిట్ట అని చెప్పవచ్చు.
దీంతో తమిళంతో పాటు తెలుగులో కూడా సెల్వ రాఘవన్ చిత్రాలకి మంచి డిమాండ్ ఉంది.
అయితే సెల్వ రాఘవన్ సినిమా జీవిత పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
కాగా ఆ మధ్య ప్రముఖ తెలుగు వెటరన్ హీరోయిన్ సోనీ అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కానీ పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ సెల్వ రాఘవన్ ఏడాది కాలంలోనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు సెల్వ రాఘవన్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పలు కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరో ధనుష్ సెల్వ రాఘవన్ కి తమ్ముడు అవుతాడని.
కాగా సెల్వ రాఘవన్ తండ్రి దర్శకుడు కస్తూరి రాజా అప్పటికే తమిళ సినిమా పరిశ్రమలో మంచి పేరున్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
"""/"/ ఈ క్రమంలోనే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
దీంతో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ని ధనుష్ కి ఇచ్చి వివాహం చేశారు.
కాగా ఐశ్వర్య కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాలతో సహా నిర్మాతగా వ్యవహరించడం కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రస్తుతం తమిళంలో "రాయన్" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే హీరో ధనుష్ కూడా తమిళం తెలుగు బాలీవుడ్ తదితర భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్…. బ్లాక్ బస్టర్ కావడం పక్కా?