భీమ్లా నాయక్ లో అద్భుతన నటన కనబర్చిన గడ్డం వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

పవన్ కల్యాణ్ నటించిన తాజా సినిమా భీమ్లానాయక్.శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యింది.

తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకు పోతుంది.ఈ సినిమాలో చాలా మంది నటీనటులు యాక్ట్ చేశారు.

కొన్ని పాత్రలు మాత్రం సినిమాకు హైలెట్ గా నిలిచాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమాలో ప్రధానంగా ఓ క్యారెక్టర్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు.

? గతంలో ఏ సినిమాల్లో నటించారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు జనాలు.

ఈ సినిమాలోని ఓక సీన్ లో డానియ‌ల్ శేఖ‌ర్ అడ‌విలో మేక‌లు కాసే గ‌డ్డం మ‌నిషి ద‌గ్గ‌ర‌కొచ్చి భీమ్లా నాయ‌క్‌ను దేవుడిగా గిరి జ‌నులు ఎందుకు కొలుస్తున్నారు అని అడుగుతాడు.

అప్పుడు డానియల్ కు  ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఆడపిల్లలను చెరబడుతాడు.

అతి కిరాతకంగా ప్రవర్తిస్తాడు.వాడిని భీమ్లా నాయక్ అంతమొందిస్తాడు.

అతడి గ్యాంగ్ ను ఊచకోత కోస్తాడు.అప్పటి నుంచి గిరిజనులకు విముక్తి కలుగుతుంది.

అప్పటి నుంచి తనను గిరిజనులు దేవుడిగా కొలుస్తున్నట్లు చెప్తాడు.క్లైమాక్స్ లో డానియల్ తో జరిగే ఫైట్ లో భీమ్లా నాయక్ పడిపోతే అతడిని లేపడంలో అదే గడ్డం వ్యక్తి సహకరిస్తాడు.

ఆ నటుడు మరెవరో కాదు ఎంఎస్ చౌదరి.రెండే రెండు సీన్లలో తను కనిపిస్తాడు.

ఆయన రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కూడా.నాటకాల్లో ఆయన ఏకంగా  17 నంది అవార్డులను అందుకున్నాడు.

"""/" / అంతేకాదు.ఇప్పటి వరకు తను 30 సినిమాల్లో నటించాడు.

మ‌హాత్మ‌, నీకు నాకు డాష్ డాష్‌ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించడు.పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కంటే ముందు గబ్బర్ సింగ్, అజ్ఞాత‌వాసి సినిమాల్లో నటించాడు.

భీమ్లా నాయక్ సినిమాలో గడ్డం వ్యక్తి క్యారెక్టర్ కు చౌదరి బాగుంటాడని పవన్ చెప్పాడట.

మొత్తంగా ఈ సినిమాలో ఆయన కనిపించింది కొన్ని సీన్లే అయినా.బాగా ఆకట్టుకున్నాడు.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన జెట్టీ అనే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా త్వరలో విడుదల కానుంది.

సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వారిపై లాఠీ చార్జీ