Venkatesh : సైందవ్ ప్లాప్ అవుతుందని వెంకటేష్ కి ముందే తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం లో చాలావరకు సక్సెస్ అయ్యాడు.

ఇక అదే రూట్ ని కంటిన్యూ చేస్తు ఇప్పటివరకు కూడా ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన శైలేష్ కొలను( Shailesh Kolenu ) డైరెక్షన్ లో చేసిన సైంధవ్ సినిమా( Saindhav Movie ) ఆశించిన విజయాన్ని అందించలేదు.

దాంతో ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.ఇక డైరెక్టర్ శైలేష్ కొలన్ ఇంతకుముందు హిట్, హిట్ 2 అనే రెండు సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

సైంధవ్ సినిమాతో మాత్రం తను భారీ ఫ్లాప్ ని చవి చూడాల్సి వచ్చింది.

అయితే దీనికి కారణం ఏంటి అంటే సినిమా స్క్రిప్ట్ లోనే చాలా తేడా ఉంది అంటూ విమర్శకులు సైతం చాలా విమర్శలు అయితే చేస్తున్నారు.

మొత్తానికైతే ఈ స్క్రిప్ట్ ని కనక కొంచెం మార్పు చేసి ఉంటే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అయ్యేదని చాలామంది మేధావులు అయితే ఈ సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

"""/" / అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే వెంకటేష్ కి ఈ సినిమా సక్సెస్ కాదనే విషయం తెలుసట కాకపోతే రిలీజ్ సమయంలో సినిమా గురించి ప్రమోషన్స్ చేయకపోతే కనీసం ఓపెనింగ్స్ కూడా రావానే ఉద్దేశ్యం తో తను ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాకి హైప్ తీసుకొచ్చాడు.

ఇక మొత్తానికైతే వెంకటేష్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ చేంజ్ చేద్దామని చెప్పాడంట.

కానీ డైరెక్టర్ మాత్రం అది వినకుండా డైరెక్ట్ గా తీసేసాడు.ఇక దానివల్లే ఈ సినిమా పోయిందని మరి కొంతమంది తెలియజేస్తున్నారు.

బడి పిల్లలకు మందు నేర్పుతున్న టీచర్.. ‘నీళ్లు కలిపి తాగండి’ అంటూ.. వీడియో వైరల్!