పాప పుట్టక ముందే ఉపాసన లింగ నిర్ధారణ చేయించుకుందా.. అందుకే ఆరోజు అలా కనిపించిందా?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

వీరి పెళ్లయినప్పటి నుంచి మెగా అభిమానులు రామ్ చరణ్ వారసుల కోసం ఎంతగానో ఎదురు చూశారు.

మొత్తానికి ఈరోజు రామ్ చరణ్ తండ్రి కావటంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు.

ఇక ఉపాసన గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు చెయ్యి వదలకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు.

తనకోసం షూటింగ్లకు బ్రేక్ తీసుకొని మరి సమయాన్ని గడిపాడు.తనకు కావాల్సినవన్నీ దగ్గరుండి అందించాడు.

ఎక్కడికి వెళ్లిన చెయ్యి పట్టుకొని మరి ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్లాడు.అలా రామ్ చరణ్ తన భార్య ఉపాసనపై చూపించిన ప్రేమ చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు.

"""/" / ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కూడా దీవించారు.ఇక తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్న తమ బిడ్డ రాకకోసం ఈరోజు బిడ్డ తమ ఫ్యామిలీలోకి రావటంతో సంతోషంలో ఉప్పొంగిపోతున్నారు.

ఉపాసన నిన్న తమ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఈరోజు ఉదయాన్నే పాపకు జన్మనిచ్చింది.

ఇక ఈ విషయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరికీ తెలియజేశారు మెగా ఫ్యామిలీ( Mega Family ).

దీంతో ఉపాసన, రామ్ చరణ్ లకు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలతో పాటు తమ సన్నిహితులు, స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఉపాసన గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

అదేంటంటే వారికి పాపే పుడుతుందని మూడు నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెలుసు అని.

ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్లకు ఈ విషయం అప్పుడే తెలిసింది అని అంటున్నారు.

"""/" / అంతేకాకుండా పాప పుడుతుందని ఉపాసన కూడా కొన్ని హింట్ లైతే ఇచ్చింది.

గతంలో ఉప్సీ - ఆర్సి( Upsi - RC ) అనే పార్టీని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ పార్టీకి తమ ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ను ఇన్వైట్ చేశారు.

అయితే ఆరోజు ఉపాసన బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించగా.చాలామంది ఉపాసనకు పాప పుడుతుంది అని అనుకున్నారు.

కారణం తను వేసుకున్న బేబీ పింక్ కలర్ డ్రెస్ అని చెప్పాలి.ఎందుకంటే చాలామంది అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఇష్టమని.

పిల్లలకు కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టమని.అందుకే ఉపాసన ఆరోజు పింక్ కలర్ డ్రెస్ ధరించింది అని అంటున్నారు.

అంటే ఉపాసన మూడు నెలలు ప్రెగ్నెన్సీ సమయంలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుందని.

అందుకే ఆమెకు ఆడపిల్ల పుడుతుందని తెలియటంతో పింక్ కలర్ డ్రెస్ లో కనిపించింది అని కొందరు ట్రెండ్ చేస్తున్నారు.

దీంతో మెగా అభిమానులు.హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్లకు అన్ని విషయాలు ముందుగానే తెలుస్తుంటాయి అని ఇందులో తప్పేముంది అని వెనకేసుకొస్తున్నారు.

‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్‌ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్