ఓటమి తరువాత ట్రంప్ కు మానసిక వ్యాధి సోకిందా....???

ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అమెరికా అధ్యక్షుడిగా కంటే కూడా వివాదాల అధ్యక్షుడిగా ట్రంప్ పేరు తెచ్చుకున్నారు.

నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో సార్లు విమర్సల పాలైన ట్రంప్ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకునే వారు కాదు.

తనదే పై చేయి అనుకునే స్వభావం అందుకే బిడెన్ గడిచిన ఎన్నికల్లో ట్రంప్ పై విజయం సాధించినా కూడా తనకు అన్యాయం జరిగిందని, కుట్ర పూరితంగా బిడెన్ ఎన్నికయ్యారంటూ కోర్టు కెక్కారు.

అంతేకాదు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.చివరికి ఓటమిని ఒప్పుకోక తప్పక వైట్ హౌస్ ను వీడారు.

వైట్ హౌస్ ను వీడే సమయంలో కనీసం బిడెన్ కు సాంప్రదాయపద్దతిలో స్వాగత కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు.

ఇక అప్పటి నుంచీ ట్రంప్ పై ట్రోల్స్ మొదలవుతూనే ఉన్నాయి.బిడెన్ ఎన్నికయిన తరువాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ట్రంప్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయలలోకి దిగారు.

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఈ క్రమంలోనే ట్రంప్ తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో ట్రంప్ బ్యాన్ అయిన తరువాత వార్తల్లో ఉండటం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు పరిపాటి అయ్యింది.

తాజాగా.ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ అక్కడ చేసిన వ్యాఖ్యలు అందరిని విస్తు పోయేలా చేశాయి.

అసలు ట్రంప్ కు ఏమయ్యింది అంటూ ర్యాలీ లో పాల్గొన్న వారు కూడా షాక్ అయ్యిపోయారట.

కవరేజ్ కోసం వచ్చిన మీడియా వారు సైతం అసలే జరుగుతోందో అర్థం కాక జుట్లు పీక్కున్నారట.

ట్రంప్ కి ఏమయినా మానసిక వ్యాధి సోకిందా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేశారు.

ఇంతకీ ట్రంప్ ఏమన్నారో తెలుసా.ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ గత వారం మార్క్ జుకర్బర్గ్ కు వైట్ హౌస్ లో తాను ఆతిధ్యం ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు జుకర్బర్గ్ తనను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఫేస్ బుక్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని కితాబు కూడా ఇచ్చారట.

ఈ వ్యాఖలు విన్న వారికి ఫ్యూజులు ఎగిరి పోయాయి.ట్రంప్ ను నెట్టింట్లో కడిగి పారేశారు.

అంతేకాదు ట్రంప్ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కొందరు, చిన్న మెదడు చితికి పోయిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 .

అరుంధతి చేయకపోతే నాకూ అలాంటి పరిస్థితే.. అనుష్క వ్యాఖ్యలు వింటే..?