టీడీపీలో ఈ వార్ మొదలయిందా ? ఇక కష్టాలే 

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంతగానో కష్ట పడుతున్నారు.

ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటే విధంగా ఆయన జిల్లాల వారీగా పర్యటనలు చేపడుతూ, భారీ బహిరంగ సభల్లోనూ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకుండా , ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఎన్ని చేసినా, 2024 ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తూ ఉండగా, ఇప్పుడు సొంత పార్టీ నాయకుల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి .

ముఖ్యంగా నియోజకవర్గాల్లో పాత కొత్త ఇన్చార్జిల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.2019 లో టిడిపి ఓటమి చెందిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తున్నా,  కార్యకర్తలను ముందుండి నడిపించే నాయకులు కరువయ్యారు .

2019 ఎన్నికల్లో ఓటమి చెందిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

2024 ఎన్నికల వరకు యాక్టిివ్ గా ఉంటే,  పార్టీ తరఫున భారీగా సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉంటుందని , అప్పటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ? తమకు టిక్కెట్ ఇస్తారో లేదో అనే ఉద్దేశంతో చాలామంది నేతలు సైలెంట్ గా ఉండి పోయారు.

  """/"/ కానీ ఇప్పుడు టిడిపి బలం పుంజుకోవడం తో వారంతా ఫామ్ లోకి వచ్చేసారు.

నియోజక వర్గంలో ఉన్న కొత్త ఇన్చార్జి లకు చెక్ పెట్టే విధంగా మాజీ మంత్రులు,  మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు యాక్టివ్ అవుతున్నారు.

దీంతో పాత కొత్త నేతల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి.ప్రస్తుతం ఈ వ్యవహారం అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం చంద్రబాబు ఈ వ్యవహారాలపై ఫోకస్ పెంచారట.ఈ మేరకు పార్టీ కీలక నాయకులను రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారట.

టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఐదుగురు దర్శకులు వీళ్లే.. ఎవరూ తక్కువ కాదంటూ?