వారంతా ‘చేయి’చ్చారా ? ఢీలాపడ్డ టి.కాంగ్రెస్ !
TeluguStop.com
మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపించేది.పార్టీలోకి వరుస వరుసగా కీలక నాయకులంతా చేరడంతో, తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సైతం తెలంగాణ పై ప్రత్యేకంగా దృష్టి సారించడం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో, ఇక్కడ కూడా ఆ తరహా ఫలితాలు వస్తాయనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపించేది.
దీనికి తగ్గట్లుగానే చేరికలు కనిపించాయి .అయితే ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదు.
జులై చివరి వరకు భారీగా చేరికలు ఉంటాయని గతంలోనే టీపీసీసీ , సీఎల్పీ పార్టీ హై కమాండ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, ఆ నెలలోనే 30 మంది కీలక నేతలు పార్టీలో చేరబోతున్నారంటూ హడావుడి చేశారు.
ఆ లిస్టులో ఇతర పార్టీలోని రాష్ట్రస్థాయి నాయకులు చాలామంది ఉండడంతో, ఆ పార్టీలో మరింతగా జోష్ పెరిగింది.
"""/" /
అయితే గడువు ముగిసినా , ఇప్పటివరకు రాష్ట్రస్థాయికి చెందిన నాయకులు ఎవరు చేరలేదు.
దీంతో కాంగ్రెస్ ( Congress Party )లో నిరుత్సాహం పెరిగింది.ఇదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వారంతా బిజెపి( BJP Party )లో చేరేందుకు సిద్ధమవుతుండడం వంటివి కాంగ్రెస్ లో గందరగోళానికి కారణం అవుతున్నాయి .
ఈ మధ్యకాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.వరుస వరుసగా చేరికలు చోటు చేసుకోవడం వంటి పరిణామాలతో , తామే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామనే ధీమా కనిపించింది.
అయితే ఇప్పుడిప్పుడే గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , ఇతర పార్టీలోని కీలక నేతలు ముందుగా కాంగ్రెస్ లో చేరాలనుకున్న, ఇప్పుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.
"""/" /
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,( Ponguleti Srinivas Reddy )మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మినహా పెద్దగా పేరున్న నేతలు ఎవరు ఇటీవల కాంగ్రెస్ లో చేరలేదు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.ఆ పార్టీలో చేరితే తమకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఏర్పడతాయనే ఆలోచనతో కొంతమంది నేతలు కాంగ్రెస్ లో ముందుగా చేరావాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నారట.
ఈ తరహా వ్యవహారాలు తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగు పూయొద్దు: పవన్ కళ్యాణ్