ఇంట్లో బల్లి ఈవిధంగా కనిపించిందా... అయితే ఇది శుభానికి సంకేతం!
TeluguStop.com
సాధారణంగా ఇంట్లో బల్లి కనిపిస్తే చాలామంది ఎంతో భయంతో గట్టిగా కేకలు వేస్తారు.
నిజానికి బల్లి ఏమాత్రం భయపెట్టే జీవికాదు కానీ బల్లిని చూడగానే చాలా మందికి భయం అనే ఒక భావన కలుగుతుంది.
అయితే ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే బల్లి ఎంతో శుభకరమైనది ఇది మన ఇంట్లో తిరగటం వల్ల సంపద పెరుగుటకు కారణమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
ఇలా బల్లులు మన ఇంట్లో దేవుడి గదిలో కనిపిస్తే ఎంతో శుభసూచకమని అలా కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
ఇక నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో మనకు ఇంట్లో బల్లులు కనబడితే అవి పెద్ద వారి రాకను సూచిస్తుందని అర్థం.
ఇలా పూర్వీకులు మన ఇంటికి వచ్చినట్లు సంకేతం.అంతేకాకుండా నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో చనిపోయిన బల్లులు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని అర్థం.
ఇక చాలామందికి కలలో కూడా బల్లులు కనిపిస్తుంటాయి ఇలా కలలో బల్లి కనిపించడం మీరు దాన్ని తరమాలని ప్రయత్నిస్తున్నా పారిపోతుంటే మీరు తొందరలోనే ఏదో శుభవార్త వింటారని అర్థం.
""img Src= "/
ఇక రెండు బల్లులు పోట్లాడే సంఘటనను చూసిన లేదా అలా కలలో కనిపించిన అది అశుభానికి సంకేతం.
ఇలా బల్లులు పోట్లాడటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయని అర్థం.
ఇక ఇంట్లో లేదా నేలపై బల్లి పాకుతూ కలలో కనిపిస్తే భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని అర్థం.
అయితే ప్రతిరోజు బల్లిని చూడటం శుభప్రదమని ముఖ్యంగా దీపావళి రోజు మన ఇంట్లో బల్లి కనబడితే అది లక్ష్మి రాకను సూచిస్తుందని బల్లి శాస్త్రం చెబుతోంది.
ఇండియన్ దుస్తుల్లో అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలు. అనార్కలీ, కుర్తాలో అదరగొట్టారు…