ఆ విలయాన్ని చేపలు ముందే గుర్తుపట్టయా..?!

తాజాగా ఉత్తరాఖండ్ లో వరద విలయం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఒక్కసారిగా మంచుకొండలు విరుచుకుపడడంతో ధౌలిగంగ నదికి వరదలతో గ్రామాల్లోని ప్రజలు గల్లంతయ్యారు.ఈ వరదలలో భాగంగా రైనీ గ్రామంలోని  రుషిగంగ డ్యామ్ కొట్టకపోవడంతో పాటు 200 మందికి పైగా గల్లంతయ్యారు.

ఇది ఇలా ఉండగా ఈ విలయ తాండవం జరగక ఒక గంట ముందు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసు గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.

ఆ వింత సంఘటనను చూడడానికి లాసు గ్రామంలోని ప్రజలు అక్కడికి వచ్చి వీక్షించారు.

ఇంతకీ ఆ వింత ఏమిటా అని అనుకుంటున్నారా.? అలకనంద నదిలో వేలకొద్ది చేపలు నది ఒడ్డుకు చేరుకుని చేతికి అందేంత లోతుల్లో దర్శనమిచ్చాయి.

ఈ సంఘటన చూసిన గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.అంతే కాకుండా బల్లలు కూడా అవసరం లేకుండా కుప్పలు కుప్పలుగా చేతికి చేపలను గ్రామస్తులు వారి ఇళ్లకు తీసుకెళ్లారు.

కాసేపట్లో ఒక విలయం రాబోతుందని వారు ఎవరు కూడా అనుకోలేదు. """/"/ ఇలా ఉండగా సాధారణంగా చేపలు ఎప్పుడూ కూడా ఒడ్డుకు చెరువు చేతికి అందే లోతులలో అసలు వెళ్ళమని, నది మధ్యలో చాలా లోతు ఉంటాయని ఆ ప్రాంతంలో ఒకరైన అజయ్ పురోహిత్ తెలియజేశాడు.

మరి చేపలు ఎందుకు ఇలా వచ్చాయో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.తప్ప అసలు విషయం గమనించలేకపోయారు.

అంతేకాకుండా ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులో ఉండే నీళ్లు కూడా బురుద రంగులోకి మారాయన్న విషయాన్ని కూడా గ్రామస్తులు గ్రహించలేకపోయారు.

ఇలాంటి విపత్కర పరిస్థితులను చేపలు ముందుగానే గ్రహిస్తాయా అని అంటే.?! అవును అనే సమాధానమే వినిపిస్తుంది వైల్డ్ లైఫ్ షూట్ ఆఫ్ ఇండియన్ లోని సీనియర్ సైంటిస్ట్ ల నుంచి.

నిజానికి చేపలలో సెన్సార్ వ్యవస్థకు ముందుగానే తెలిసి ఉంటుందని వారు తెలిపారు.అలాగే నీటిలో వచ్చే కదలికలు ఒత్తిడిలో వచ్చే మార్పులను అవి ముందుగానే గుర్తిస్తాయని వారు తెలియజేస్తున్నారు.

ఈ తరుణంలోనే వరద ముందే వచ్చిన శబ్దాన్ని చేపలు ముందే గ్రహించి ఉండవచ్చు అని సీనియర్ సైంటిస్ట్ ఒకరు అంచనా వేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??