విభేదాలు జగన్ – విజయసాయి రెడ్డి ల మధ్య బంధానికి దూరం పెంచాయా…?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్(YSR Congress) పార్టీ లో విజయసాయి రెడ్డి కి ఉన్న గుర్తింపు ,ప్రాముఖ్యం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

పార్టీ కి నెంబర్ 2 గా ఉంటూ తన తెలివతేటలతో,సామర్ధ్యాలతో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ,ప్రణాళికలు రచిస్తూ ,వాటిని సమర్థవంతంగా గా అమలు చేస్తూ సీఎం జగన్ కు కుడి భుజం లా పని చేసేవారు.

గత ఎన్నికల్లో పార్టీ అధికారం లోకి రావడం లో కూడా ఆయన పాత్ర చాలానే ఉంది అని చెప్పక తప్పదు.

నిజానికి జగన్ కుటుంబం తో విజయసాయిరెడ్డి బంధం ఈనాటిది కాదు.జగన్ తాత రాజారెడ్డి(Raja Reddy) నుండి తండ్రి రాజశేఖర్ రెడ్డి కాలం నుండి కూడా ఆ కుటుంబానికి విధేయుడు గానే ఉంటున్నారు విజయసాయిరెడ్డి.

"""/" / అలాంటి వారి మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయనీ ,వాటి వల్ల వారి మధ్య దూరం పెరిగిందని పార్టీ లో చర్చ జరుగుతుంది.

ఈ విభేదాలకు ముఖ్య కారణం గా తోస్తున్న విషయం ఐతే ఇప్పటివరకు పార్టీ లో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చేతిలో ఉన్న కీలక భాద్యతలను జగన్ తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy)కి అప్పజెప్పడం తో మొదలయ్యాయి అని చెప్పుకుంటున్నారు.

అంతే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల పై పూర్తి పట్టు సాధించిన తనను ఆ జిల్లాల పార్టీ భాద్యతలు నుండి తొలగించడం తో విజయసాయిరెడ్డి అలిగారని చెప్పుకుంటున్నారు.

అందుకే విజయసాయి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కానీ పార్టీ తరఫున ఎటువంటి ప్రచారం చెయ్యలేదు.

అలాగే తారకరత్న మృతి సమయం లో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) తో అత్యంత సన్నిహితంగా గా మెలగడం కూడా జగన్ కు నచ్చలేదని దాని వలన వారి మధ్య దూరం మరింత పెరిగిందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.

"""/" / ఏది ఏమైనా పార్టీ లో కీలక నేతగా ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటూ తన తెలివితేటలతో ,వాక్చాతుర్యం తో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విజయసాయిరెడ్డి పార్టీ కి దూరం అయితే ఖచ్చితంగా నష్టమేనని కొంత మంది వాదన.

అయితే ఈ విషయం పై అటు జగన్(Jagan) వైపు నుండి కానీ ఇటు విజయసాయిరెడ్డి వైపు నుండి కానీ ఎటువంటి స్పందన లేదు.

ఇప్పటికైతే అన్ని ఆధారాలు లేని ఊహాగానాలే .మరి త్వరలోనే వీటికి తెర దించుతారా లేక ఈ ఊహాగానాలే నిజమై పార్టీ కి నష్టాన్ని మిగులుస్తుందా చూడాలి.