చాట్‌జీపీటీ దెబ్బకు కాపీరైటర్ ఉద్యోగం గోవిందా! ఆఖరికి డాగ్ వాకర్‌గా మారిపోయింది పాపం!

ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపిస్తోన్న పేరు చాట్‌జీపీటీ( ChatGPT ).ఈ అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కొద్ది నెలలుగా ఆందోళనలు వ్యక్తమౌతున్న విషయం విదితమే.

ముఖ్యంగా రైటర్స్ స్థానాలను ఇవి భర్తీ చేయగలవని చాలా స్టడీస్ పేర్కొనగా ఈ ఆందోళనలు ఒక టెక్ కాపీరైటర్ విషయంలో నిజం కావడం కొసమెరుపు.

రీసెంట్‌గా ఒక టెక్ స్టార్టప్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి, ఆ స్థానాన్ని చాట్‌జీపీటీతో భర్తీ చేసింది.

ఉన్నపళంగా ఉద్యోగం ఊడిపోవడంతో చేసేది ఏమీ లేక ఆమె చివరికి డాగ్ వాకర్‌గా మారిపోయాడు పాపం.

"""/" / శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco )కు చెందిన 25 సంవత్సరాల ఒలివియా లిప్కిన్( Olivia Lipkin ) ఒక టెక్ కంపెనీలో కాపీ రైటర్‌గా పనిచేస్తోంది.

ఆ కంపెనీలో ఆమె ఒక్కరే రైటర్‌గా పని చేస్తున్నారు.అయితే 2022, నవంబర్ నెలలో చాట్‌జీపీటీ లాంచ్ అయినప్పుడు ఒలివియా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, కాలక్రమేణా ఆమె సహోద్యోగులు స్లాక్ అనే వారి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లో చాట్‌బాట్‌ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఆర్టికల్స్ షేర్ చేయడం స్టార్ట్ చేసారు.

దీనిని ఒలివియా గమనించింది.అయితే, ఏప్రిల్‌లో ఒలివియా ఎలాంటి వివరణ లేకుండానే అనూహ్యంగా తన ఉద్యోగం కోల్పోయింది.

"""/" / అవును, AI టూల్ తన ఉద్యోగాన్ని లాగేసుకుందని స్పష్టంగా తెలుస్తున్నట్లు ఆమె వివరించింది.

లిప్కిన్ చాట్‌జీపీటీని ప్రస్తావించినప్పుడల్లా అది తన స్థానాన్ని భర్తీ చేస్తుందనే భయం ఆమెని వెంటాడేది.

చివరికి ఆమె భయమే నిజమైంది.ఉద్యోగం కోల్పోయిన తర్వాత, ఒలివియా కంటెంట్ మార్కెటింగ్ చేయడం గురించి ఆలోచించింది.

కానీ లాభం లేకుండా పోయింది.కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేస్తే ఇలాగే ఉంటుందని, మళ్లీ రైటర్‌గా ట్రై చేసినా చాట్‌జీపీటీ వల్ల అది పోతుందని ఆమె ఆలోచించింది.

చివరికి డాగ్ వాకర్‌గా చేరడమే మంచిదని నిర్ణయించుకుంది.అవును, రానున్న రోజుల్లో చాట్‌జీపీటీ వలన ఎందరికో గడ్డుకాలం రాబోతోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!