బావిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి?
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఇరుగు చందు (13) తండ్రి ఇరుగు మల్సూర్ అనే బాలుడు మధ్యాహ్నము స్నేహితులతో కలిసి సరదాగా సంగెం శివారులో గల బావిలో ఈతకు వెళ్లాడు.
కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత స్నేహితులందరూ బావినుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని అనగా నేను ఇంకా కొద్దిసేపు ఈతకొట్టి వస్తానని స్నేహితులకు చెప్పాడని,ఇరుగు చందు పైకి రాకపోయేసరికి వెనక్కి వచ్చి
చూసేసరికి లోపలికి మునిగినట్టుగా అనుమానించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం 2 మోటర్లు పెట్టి నీటిని తోడుతున్నామని,నీరు చాలా ఎక్కువ ఉందని,బాడీ ఇంకా బయటపడలేదని,ఇట్టి సంఘటనపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ డానియల్ తెలిపారు.
ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు ఒకే కానీ మిగతా యంగ్ హీరోలు సక్సెస్ కొట్టకపోతే కష్టమేనా..?