కొత్త పార్టీ నిర్ణయంపై రేవంత్ వెనక్కి తగ్గినట్లేనా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మౌనం వహిస్తూ చాలా ఆచితూచీగా వ్యవహరిస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనంగా ఉన్న పరిస్థితులలో రేవంత్ ఇప్పటి వరకు ఒంటరి పోరాటం చేసిన పరిస్థితులలో కాంగ్రెస్ ను పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ ను గట్టెక్కించాలని ప్రయత్నించినా అంతర్గత పోరుతో కాంగ్రెస్ ఎప్పటికప్పుడు నష్టపోతూ ఉన్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ పటిష్టతకు ఎవ్వరు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా ఏ మాత్రం కాంగ్రెస్ పటిష్టత మాత్రం పెరగడం లేదు.

ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నిలదొక్కుకోవలసిన అవసరం ఉంది.లేకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది.

అదే జరిగితే కాంగ్రెస్ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఒక నెల క్రితం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగినా మరల కొత్త పార్టీ ఏర్పాటుపై మరల ఎటువంటి ప్రచారం సాగలేదు.

ఇక దీనిపై స్పష్టత రావాలంటే రేవంత్ స్పందించవలిసిందే.ఈటెల భర్తరఫ్ తరువాత పెద్ద ఎత్తున కొత్త చర్చ కూడా ప్రారంభమైంది.

అయితే ఈటెల, రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే చర్చ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.

పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. గొప్పోడంటూ?